Home /News /business /

NOW THE MINIMUM BALANCE WILL HAVE TO BE DOUBLE IN THE SAVINGS ACCOUNT OF PUNJAB NATIONAL BANK MK

New Charges: ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా...అయితే మీకు భారీ షాక్... ఈ నెల 15 నుంచి కొత్త ఛార్జీల బాదుడు

New Charges: ఈ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి షాక్... రేపటి నుంచి కొత్త ఛార్జీలు
(ప్రతీకాత్మక చిత్రం)

New Charges: ఈ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి షాక్... రేపటి నుంచి కొత్త ఛార్జీలు (ప్రతీకాత్మక చిత్రం)

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కొత్త సంవత్సరంలో తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పీఎన్బీ తన సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన వివిధ సేవల ఛార్జీలను పెంచింది. ఈ మార్పులు తదుపరి 15 జనవరి 2022 నుండి అమల్లోకి రానున్నాయి.

ఇంకా చదవండి ...
    పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కొత్త సంవత్సరంలో తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పీఎన్బీ తన సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన వివిధ సేవల ఛార్జీలను పెంచింది. ఈ మార్పులు తదుపరి 15 జనవరి 2022 నుండి అమల్లోకి రానున్నాయి. PNB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సేవింగ్స్ ఖాతాలు, లాకర్లు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, కరెంట్ ఖాతాల వంటి సౌకర్యాల కోసం బ్యాంక్ నిబంధనలను మార్చేసింది. ఇప్పుడు సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ చార్జీని కూడా రెట్టింపు చేశారు. డిమాండ్ డ్రాఫ్ట్ రద్దు కోసం ఇప్పుడు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

    సేవింగ్స్ ఖాతాలో మినిమం బాలెన్స్ 10,000 రూపాయలు ఉండాలి

    PNB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో నివసించే కస్టమర్‌లు తమ సేవింగ్స్ ఖాతాలో కనీసం రూ.10,000 బ్యాలెన్స్ మెయిన్ టెయిన్ చేయాలని నిబంధన జారీ చేసింది. అయితే గతంలో ఈ మొత్తం రూ.5000గా ఉండేది. అయితే మినిమం బ్యాలెన్స్ మెయిన్ టెయిన్ చేయకపోతే మాత్రం చార్జీని రూ.300 నంచి రూ. 600కు పెంచేశారు. మినిమమ్ బ్యాలెన్స్ కంటే తక్కువ మొత్తంలో ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు ప్రతి త్రైమాసికానికి రూ.200కి బదులుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.

    లాకర్ ఫీజు పెరిగింది...

    PNB లాకర్ ఛార్జీలలో కూడా మార్పులు చేసింది. అదనపు పెద్ద సైజు లాకర్లు మినహా అన్ని రకాల లాకర్లు ఇప్పుడు అధిక రుసుము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ, మహానగరాల్లో లాకర్ చార్జీని రూ.500కు పెంచారు. చిన్న సైజు లాకర్ చార్జీ గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి రూపాయలు ఉండగా, దానిని రూ.1,250కి తగ్గించారు. పట్టణ ప్రాంతాల్లో చిన్న లాకర్ల ఛార్జీని రూ.1,500 నుంచి రూ.2,000కు పెంచారు. మధ్య తరహా లాకర్ చార్జీ గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,000 నుంచి రూ.2,500కి పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో రూ.3,000 నుంచి రూ.3,500కి పెంచింది.

    లాకర్ సందర్శనలను తగ్గించింది

    PNB లాకర్ సందర్శనల సంఖ్యను కూడా తగ్గించింది. మీరు ఇప్పుడు సంవత్సరంలో 12 సార్లు లాకర్‌ని సందర్శించవచ్చు. దీని తర్వాత, ప్రతి సందర్శనపై రూ. 100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 15 సార్లు లాకర్ విజిట్ సౌకర్యం అందుబాటులో ఉండడం గమనార్హం.

    కరెంట్ ఖాతా మరింత ప్రియం..

    కరెంట్ ఖాతా ఒక సంవత్సరంలోపు కరెంట్ ఖాతాను మూసివేస్తే, అప్పుడు రూ. 800 రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటి వరకు రూ.600 ఉండేది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Punjab National Bank

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు