Home /News /business /

NOW TATA NEXON CAR IS GETTING READY IN COUPE DESIGN RANGE OF 400 KM IN SINGLE CHARGE MK

Tata Nexon EV: మార్కెట్లోకి టాటా మోటార్స్ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు...డిజైన్, ఫీచర్స్ లీక్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

టాటా హారియర్ తరహాలో కూపే స్టైల్ డిజైన్‌లో నెక్సాన్‌ను తీసుకువస్తోంది. ఇది హ్యుందాయ్ క్రెటాతో పోటీ పడనుంది. ఇది మిడ్-సైజ్ సబ్-కాంపాక్ట్ నెక్సాన్ SUV కారు. దీని డిజైన్ కూపే కారులా ఉంటుంది.

    Tata Nexon EV:  టాటా మోటార్స్ తమ కారును EV సెగ్మెంట్‌లో కొత్త కొత్త కార్లతో అదరగొడుతోంది. ఇప్పటికే టాటా మోటార్స్ నుంచి నెక్సాన్  పేరిట ఈవీ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు టాటా హారియర్ తరహాలో కూపే స్టైల్ డిజైన్‌లో నెక్సాన్‌ను తీసుకువస్తోంది. ఇది హ్యుందాయ్ క్రెటాతో పోటీ పడనుంది. ఇది మిడ్-సైజ్ సబ్-కాంపాక్ట్ నెక్సాన్ SUV కారు. దీని డిజైన్ కూపే కారులా ఉంటుంది. నెక్సాన్ మాదిరిగానే, ఇది కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌తో మార్కెట్లోకి రానుంది. కంపెనీ EV సెగ్మెంట్‌లో కొత్త కార్లను తీసుకురానుంది. ఈ ఎలక్ట్రిక్ SUV కారు డిజైన్స్, ఫీచర్లు ఇప్పటికే బయటపడ్డాయి.  కారు లోపలి భాగాల విషయానికి వస్తే, ప్రస్తుత నెక్సాన్ EVతో పోలిస్తే స్టైలింగ్ అప్‌గ్రేడ్‌తో వస్తుందని ఆటో వర్గాలు సూచిస్తున్నాయి. Nexon EV తరహాలో కాకుండా, ఈ కూపే SUV స్ప్లిట్ లైటింగ్ సెటప్‌ను చూస్తుంది. ఎగువ భాగంలో సొగసైన LED DRL ఉందనుంది. దిగువ భాగంలో బంపర్‌పై కొత్త హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

    ఫ్రంట్ బంపర్ చాలా ఆకర్షణీయంగా ఉంది...

    రాబోయే ఈ టాటా కారు, ఫ్రంట్ బంపర్ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపించనుంది. Nexon EV లాగానే కూపే SUV కూడా పైకప్పు వెంట బ్లాక్-అవుట్ పిల్లర్‌లను గమనించవచ్చు. సైడ్ ప్రొఫైల్ బ్లాక్ క్లాడింగ్, కొత్త అల్లాయ్ వీల్స్ చూపిస్తుంది.

    ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల రేంజ్

    రాబోయే ఈ టాటా కారు రేంజ్ గురించి మాట్లాడితే, దాని EV వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిమీల డ్రైవింగ్ రేంజ్ ని అందించనుంది. ఈ బ్యాటరీ ప్యాక్ Nexon EV  అప్‌గ్రేడ్ వెర్షన్‌తో ప్రారంభం కానుంది.

    ప్రస్తుతం, చాలా టాటా కార్లు EV సెగ్మెంట్‌లో ఉన్నాయి, వీటిలో నెక్సాన్, టాటా టిగోర్ వంటి కార్లు ఉన్నాయి. ఇవి బడ్జెట్ కార్ల విభాగంలో వస్తాయి. వీటికి మంచి స్పందన లభిస్తోంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Electric cars, New cars

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు