NOW STATE BANK OF INDIA CUSTOMERS CAN WITHDRAW CASH AT SBI ATMS WITHOUT USING ATM CARD KNOW HOW SS
SBI: ఇక కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చు ఇలా...
SBI: ఇక కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చు ఇలా...
SBI YONO Cash | యోనో యాప్ ఉంటే దేశంలోని 16,500 ఎస్బీఐ ఏటీఎంలల్లో ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చు. ఈ సర్వీసు ఉన్న ఏటీఎంలకు 'యోనో క్యాష్ పాయింట్స్' అని నామకరణం చేసింది ఎస్బీఐ.
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇకపై మీరు ఏటీఎం కార్డు మర్చిపోయినా... మీ కార్డు అందుబాటులో లేకపోయినా... ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఫీచర్ ఇది. ఇందుకోసం మీకు YONO యాప్ ఉండాలి. ఈ యాప్ ఉంటే దేశంలోని 16,500 ఎస్బీఐ ఏటీఎంలల్లో ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చు. ఈ సర్వీసు ఉన్న ఏటీఎంలకు 'యోనో క్యాష్ పాయింట్స్' అని నామకరణం చేసింది ఎస్బీఐ. కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడం ద్వారా స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలను తగ్గించొచ్చని ఎస్బీఐ భావిస్తోంది. యోనో యాప్‌లో యోనో క్యాష్ ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సాధ్యమవుతుంది.2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది.
కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఫీచర్ ఎలా ఉపయోగించుకోవాలి?
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో YONO యాప్ డౌన్లోడ్ చేయాలి.
ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లల్లో ఈ యాప్ పనిచేస్తుంది.
యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ యోనో క్యాష్ క్లిక్ చేయాలి.
అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి.
6 అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది.
ఈ రిఫరెన్స్ నెంబర్ 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది.
మీకు దగ్గర్లో ఉంటే యోనో క్యాష్ పాయింట్‌కు వెళ్లాలి.
ముందుగా మీకు ఎస్ఎంఎస్లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి.
మీరు యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌ను ఏటీఎంలో ఎంటర్ చేయాలి.
మీరు యాప్‌లో క్రియేట్ చేసిన 6 అంకెల యోనో క్యాష్ పిన్ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
ఇలా కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం కల్పించిన మొట్టమొదటి బ్యాంక్ ఎస్బీఐ కావడం విశేషం.
Photos: ఈ లేడీ బైకర్ ఆన్లైన్ సెన్సేషన్... అమ్మాయిలకు ఇన్స్పిరేషన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.