NOW PASSENGER CAN SEE RAILWAY RESERVATION CHARTS IN IRCTC WEBSITE SS
IRCTC: ఇక ఆన్లైన్లో రైల్వే రిజర్వేషన్ చార్టులు... ఖాళీ బెర్తులు మీరే చూసుకోవచ్చు
IRCTC: ఇక ఆన్లైన్లో రైల్వే రిజర్వేషన్ చార్టులు... ఖాళీ బెర్తులు మీరే చూసుకోవచ్చు
Railway Reservation Charts in Online | రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు మొదటి చార్ట్ ప్రిపేర్ చేస్తారు. వెంటనే ఆ చార్ట్ ఆన్లైన్లో కనిపిస్తుంది. రైలు స్టేషన్ నుంచి బయల్దేరడానికి 30 నిమిషాల ముందు రెండో చార్ట్ అందుబాటులోకి వస్తుంది.
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై మీరు రైలులో ఖాళీ బెర్తుల కోసం టీటీఈ వెంట పరుగెత్తాల్సిన అవసరం లేదు. ట్రైన్ రిజర్వేషన్ చార్ట్స్ అన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ. రైలు సిబ్బందిలో అవినీతి అరికట్టేందుకు, టికెట్ల జారీని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఏవైనా బెర్తులు ఖాళీగా ఉంటే ఆ సమాచారం ప్రయాణికులకు సులువుగా తెలిసిపోతుంది. రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు మొదటి చార్ట్ ప్రిపేర్ చేస్తారు. వెంటనే ఆ చార్ట్ ఆన్లైన్లో కనిపిస్తుంది. రైలు స్టేషన్ నుంచి బయల్దేరడానికి 30 నిమిషాల ముందు రెండో చార్ట్ అందుబాటులోకి వస్తుంది. మొదటి చార్ట్ తర్వాత చేసిన రిజర్వేషన్లు, క్యాన్సలేషన్ల మార్పులు రెండో చార్టులో కనిపిస్తాయి.
ఈ కొత్త ఫీచర్ వెబ్ వర్షన్‌తో పాటు ఐఆర్సీటీసీ మొబైల్ యాప్‌లో కూడా కనిపిస్తాయి. ఆన్లైన్లో కనిపించిన రిజర్వేషన్ చార్టులో ఏవైనా ఖాళీలు ఉంటే ప్రయాణికులు టీటీఈని సంప్రదించొచ్చు. irctc.co.in వెబ్సైట్లో బెర్తుల వారీగా అకామడేషన్ స్టేటస్ గ్రాఫిక్స్ రూపంలో కనిపిస్తాయి. కోచుల్లోని 9 క్లాసుల లేఅవుట్ కనిపిస్తుంది. ఇక తాత్కాలిక పద్ధతిలో టీటీఈలు ప్రయాణికులకు బెర్తుల్ని నిరాకరించే అవకాశం లేదు. అంతే కాదు... ప్రయాణికులు పీఎన్ఆర్ ద్వారా తమకు బెర్త్ ఏ కోచ్‌లో కేటాయించారో గ్రాఫికల్ లేఅవుట్లో చూసుకోవచ్చు. మరి IRCTC వెబ్సైట్లో రిజర్వేషన్ చార్టుల్ని ఎలా చూడాలో తెలుసుకోండి.
1. ముందుగా IRCTC వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు “Charts/Vacancy” అని కొత్త ఆప్షన్ కనిపిస్తుంది.
2. ట్రెయిన్ నెంబర్, జర్నీ డేట్, బోర్డింగ్ స్టేషన్ లాంటి వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్లాస్ వారీగా, కోచ్ వారీగా ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలు తెలుస్తాయి.
3. యూజర్లు ఏదైనా ఓ కోచ్పైన క్లిక్ చేసి లేఅవుట్లో బెర్తులవారీగా అకామడేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అందులో మీకు occupied for full journey, occupied for part journey, vacant for full journey అని మూడు స్టేటస్లు కనిపిస్తాయి.
4. ఇక కోచ్ లేఅవుట్లో ఏదైనా PNR బెర్త్ వివరాలు తెలుసుకోవాలంటే PNR Enquiry & book ticket history ఓపెన్ చేసి చూడొచ్చు.
Photoshoot: క్యాన్సర్‌తో యువతి పోరాటం... పెళ్లి కూతురులా ముస్తాబై ఫోటోలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.