Home /News /business /

NOW LIC PENSION POLICYHOLDERS CAN GET AADHAR BASED DIGITAL BASED LIFE CERTIFICATES AK GH

LIC పెన్షన్ పాలసీదారులకు గుడ్​న్యూస్​.. డిజిటల్ విధానంలో లైఫ్ సర్టిఫికేట్.. ఈ యాప్ డౌన్ ద్వారా..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

LIC Digital Certificate: కరోనా కారణంగా వృద్దులు నేరుగా ఎల్​ఐసీ కార్యాలయాలకు రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్​లైన్​లోనే లైఫ్​ సర్టిఫికెట్​ పొందే అవకాశం కల్పిస్తోంది.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పెన్షనర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. వ్యక్తిగత పెన్షన్ ప్లాన్ (ఐపీపీ) యాన్యుటర్లు, ఎల్​ఐసీ స్టాఫ్ పెన్షనర్లు తమ లైఫ్​ సర్టిఫికెట్లను ఆన్​లైన్​లోనే పొందే అవకాశం కల్పిస్తోంది. పెన్షనర్లు తమ లైఫ్​ సర్టిఫికెట్లను తీసుకోవడానికి ఎల్​ఐసీ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎల్​ఐసీ జీవన్ సాక్ష్య అనే మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లోనే ఈ సర్టిఫికెట్​ పొందవచ్చు. కాగా, సకాలంలో పెన్షన్ పొందడానికి పెన్షనర్లు ప్రతి ఏటా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ సమర్పించాల్సి ఉంటుంది.

అయితే కరోనా కారణంగా వృద్దులు నేరుగా ఎల్​ఐసీ కార్యాలయాలకు రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్​లైన్​లోనే లైఫ్​ సర్టిఫికెట్​ పొందే అవకాశం కల్పిస్తోంది. అయితే, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునేందుకు పెన్షనర్లు తమ ఆధార్‌ కార్డును మొబైల్ నంబర్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. ఎల్​ఐసీ జీవన్ సాక్ష్య యాప్‌ని ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎలా పొందవచ్చో చూద్దాం.

జీవన్ సాక్ష్య యాప్‌ ద్వారా ఇలా పొందండి

1. మీ మొబైల్​లో ఎల్​ఐసీ జీవన్ సాక్ష్య యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

2. జీవన్ సాక్ష్య యాప్‌లో మీ ఆధార్ కార్డ్, పాలసీ వివరాలను నమోదు చేయండి.

3. సెల్ఫీ దిగి సబ్​మిట్​ చేయండి.

4. వెంటనే మీ ఆధార్​ లింక్​ చేసిన మొబైల్​ నంబర్​కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్​ చేసి వెరిఫికేషన్​ పూర్తి చేయండి. ఆ తర్వాత మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్​ను డౌన్​లోడ్​ చేసుకోండి.

"ఫెసిలిటేటర్" ఆప్షన్​ ద్వారా కూడా మీ లైఫ్​ సర్టిఫికెట్​ను పొందవచ్చు. యాన్యుయిటెంట్లు/స్టాఫ్ పెన్షనర్ల తరఫున వారి కుటుంబ సభ్యులు ఈ ఆప్షన్​ ద్వారా లైఫ్​ సర్టిఫికెట్​ పొందవచ్చు.

ఫెసిలిటేటర్ ద్వారా ఇలా పొందండి

1. ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్‌లో ఫెసిలిటేటర్ సమాచారాన్ని నమోదు చేయండి.

2. పెన్షనర్ ఆధార్ కార్డ్, పాలసీ వివరాలను అందించండి.

3. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ధ్రువీకరించండి.

4. యాన్యుటెంట్/పెన్షనర్ ఫోటోగ్రాఫ్​ను సబ్​మిట్​ చేయండి. వెంటనే పెన్షనర్​ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్​ కనిపిస్తుంది. దాన్ని డౌన్​లోడ్​ చేసుకోండి.​

Life insurance: లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? అయితే ఈ రైడర్లు తీసుకోవడం మర్చిపోవద్దు..

Cooking Oils: వంట నూనెల మళ్లీ తగ్గుతాయా ? పెరుగుతాయా ?.. మార్కెట్ వర్గాలు ఏం చెబుతున్నాయి...

ఇటీవల పెన్షనర్లు తమ లైఫ్​ సర్టిఫికెట్​ను సమర్పించడానికి కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించింది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పించింది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: LIC

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు