హోమ్ /వార్తలు /బిజినెస్ /

Indane Gas: వాట్సప్‌లో ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయండిలా

Indane Gas: వాట్సప్‌లో ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయండిలా

Indane Gas: వాట్సప్‌లో ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

Indane Gas: వాట్సప్‌లో ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

Indane Gas Cylinder Booking | ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కేవలం ఒక్క మెసేజ్ పంపితే చాలు సిలిండర్ బుక్ అవుతుంది. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు వాట్సప్‌లో సిలిండర్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

మీరు ఇండేన్ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? వాట్సప్‌లో ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. నేరుగా గ్యాస్ ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూటర్‌కి కాల్ చేసి సిలిండర్ బుక్ చేయొచ్చు. లేదా కస్టమర్ కేర్ నెంబర్‌కి కాల్ చేసి బుక్ చేయొచ్చు. ఇండేన్ వెబ్‌సైట్ లేదా ఇండేన్ యాప్ నుంచి కూడా సిలిండర్ బుక్ చేయొచ్చు. ఇవి మాత్రమే కాదు వాట్సప్ ద్వారా కూడా ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేయడం సాధ్యం. ఇందుకోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఓ నెంబర్ కేటాయించింది. 7588888824 నెంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ చేస్తే గ్యాస్ సిలిండర్ మీ ఇండికి వచ్చేస్తుంది. మీరు వాట్సప్ ద్వారా ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే ముందుగా 7588888824 నెంబర్ మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి ఈ నెంబర్ సెర్చ్ చేయాలి. ఛాట్ ఓపెన్ చేసిన తర్వాత Refill అని టైప్ చేసి మెసేజ్ పంపాలి. మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి మెసేజ్ చేస్తేనే బుకింగ్ సక్సెస్ అవుతుంది. ఈ నెంబర్ 24 గంటలు పనిచేస్తుంది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో పాటు అన్ని ఆయిల్ కంపెనీలు టెక్నాలజీని ఉపయోగించుకొని కస్టమర్లకు సేవల్ని మెరుగుపరుస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల సిలిండర్లు డెలివరీ చేసేందుకు డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ విధానాన్ని ప్రారంభించాయి. సిలిండర్ బుక్ చేసిన తర్వాత కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఈ కోడ్ వస్తుంది. ఈ ఓటీపీ డెలివరీ బాయ్‍కి చెప్తేనే సిలిండర్ డెలివరీ అవుతుంది. మీరు కోడ్ షేర్ చేసేవరకు డెలివరీ పూర్తి కాదు. మోసాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చాయి ఆయిల్ కంపెనీలు.

ఇక ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం కొత్త మొబైల్ నెంబర్‌ను ప్రారంభించింది. గతంలో వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరు ఫోన్ నెంబర్లు ఉండేవి. నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా 7718955555 నెంబను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు ఈ నెంబర్‌కు కాల్ చేసి సిలిండర్ బుక్ చేయాలి. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా 7718955555 నెంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది.

First published:

Tags: Indian Oil Corporation, LPG Cylinder

ఉత్తమ కథలు