Cardless Cash: HDFC ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇక కార్డు లేకుండానే ఏటీెఎం నుంచి డబ్బు విత్‌డ్రా

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పుడు హెచ్​డీఎఫ్​సీ ఖాతాదారులు బ్యాంకు ఏటీఎంల నుంచి కార్డు ఉపయోగించకుండానే డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.

  • Share this:
మీరు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కస్టమరా? మీకు బ్యాంకులో ఉన్న డబ్బు విత్ డ్రా చేయాల్సిన అవసరం వచ్చిందా? కానీ మీ దగ్గర డెబిట్ కార్డు లేదా? వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కార్డు అవసరం లేకుండానే హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కస్టమర్లు ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేసే అవకాశం ఉంది. ఈ బ్యాంక్ తాజాగా కార్డ్ లెస్ క్యాష్ విత్‌డ్రా సేవలను ప్రారంభించింది. ఇప్పుడు హెచ్​డీఎఫ్​సీ ఖాతాదారులు బ్యాంకు ఏటీఎంల నుంచి కార్డు ఉపయోగించకుండానే డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.

దీనికి సంబంధించిన వివరాలను బ్యాంకు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. "ఏటీఎం కార్డు మర్చిపోయారా? కంగారు పడకండి. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కార్డ్ లెస్ క్యాష్ డిజిటల్లీ యువర్స్ సేవలు మీకు 24X7 అందుబాటులో ఉంటాయి. అది కూడా మీ డెబిట్ లేదా ఏటీఎం కార్డు లేకుండానే.. " అంటూ బ్యాంక్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా ప్రకటించింది. ఏటీఎం నుంచి కార్డు లేకుండా డబ్బు విత్ డ్రా చేయడానికి కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఇందులో మూడు రకాల సేవలు ఎంచుకోవచ్చు. ఒకటి బెనిఫిషరీని చేర్చడం, ఆ బెనిఫిషరీకి డబ్బు పంపడం, మూడోది క్యాష్ విత్ డ్రా. వీటిని ఎలా చేయాలంటే..

1. బెనిఫిషరీని చేర్చడం
మనం ఎవరికైనా మొదటి సారి డబ్బు పంపాలంటే వారి వివరాలను మన అకౌంట్ లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి వారి పేరు సెలక్ట్ చేసుకొని పంపే వీలుంటుంది. ప్రతి ఒక్కరికీ ఇది ఒక్కసారి మాత్రమే అవసరం అవుతుంది. ఇందుకోసం ఏటీఎంలో కనిపించే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ లోకి లాగిన్ అయ్యి ఫండ్స్ ట్రాన్స్ ఫర్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రా ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో రిక్వెస్ట్ అనే బటన్ క్లిక్ చేసి యాడ్ బెనిఫిషియరీ అనే బటన్ ప్రెస్ చేయాలి. వివరాలన్నీ ఎంపిక చేసి యాడ్ అండ్ కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అరగంటకి గానీ ఆ వ్యక్తికి డబ్బులు పంపలేరు.

2. డబ్బు పంపించడం..
దీనికోసం కూడా మరోసారి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఫండ్స్ ట్రాన్స్ ఫర్ ఎంచుకొని కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత స్క్రీన్ పై మీరు రిజిస్టర్ చేసిన యూజర్ల పేర్లు కనిపిస్తాయి. ఎవరికి డబ్బు పంపాలనుకుంటున్నారో వారి పేరును ఎంచుకోవాలి. బెనిఫిషరీ వివరాలను మరోసారి చెక్ చేసి డబ్బు విలువను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కూడా మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీని అందిస్తే డబ్బు ట్రాన్స్ ఫర్ అవుతుంది.

3. క్యాష్ విత్ డ్రాయల్
హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఏటీఎంలో అయితే మీరు ముందుగా కార్డ్ లెస్ క్యాష్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత భాషను ఎంపిక చేసుకొని మీ మొబైల్ నంబర్, ఓటీపీ, ఆర్డర్ ఐడీ, డబ్బు మొత్తం వంటివన్నీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కార్డు అవసరం లేకుండా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published: