డీజిల్ కావాలంటే ఇంటికే వచ్చేస్తుంది... హోమ్ డెలివరీ ప్రారంభించిన ఐఓసీ

డీజిల్ కావాలంటే ఇంటికే వచ్చేస్తుంది... హోమ్ డెలివరీ ప్రారంభించిన ఐఓసీ (Image: Autocar)

'డోర్‌స్టెప్ డెలివరీ ఆఫ్ ఫ్యూయెల్' పేరుతో డీజిల్ డెలివరీ చేసే సేవలు చెన్నైలోనూ ప్రారంభించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. పెట్రోల్ బంకుల్లో ఉండే ఫ్యూయెల్ డిస్పెన్సర్‌లాగానే వాహనానికి డీజిల్ డిస్పెన్సర్ ఉంటుంది. ఆ వాహనం రోడ్లపై తిరుగుతూ డీజిల్ సరఫరా చేస్తూ ఉంటుంది.

 • Share this:
  మీరు డీజిల్ కొనాలనుకుంటున్నారా? అయితే పెట్రోల్ బంకుకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక్క క్లిక్‌తో ఆర్డర్ చేయొచ్చు. డీజిల్ హోమ్ డెలివరీ చేసేస్తారు. భారతదేశంలో అతిపెద్ద పెట్రోలియం కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రారంభించిన సర్వీసు ఇది. డీజిల్ హోమ్ డెలివరీ చేస్తామని కొన్ని నెలల క్రితమే ప్రకటించిన ఐఓసీ.. మహారాష్ట్రలోని పూణెతో పాటు మిగతా సిటీల్లోనూ గతంలో సేవలు ప్రారంభించింది.

  ఇప్పుడు 'డోర్‌స్టెప్ డెలివరీ ఆఫ్ ఫ్యూయెల్' పేరుతో డీజిల్ డెలివరీ చేసే సేవలు చెన్నైలోనూ ప్రారంభించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. పెట్రోల్ బంకుల్లో ఉండే ఫ్యూయెల్ డిస్పెన్సర్‌లాగానే వాహనానికి డీజిల్ డిస్పెన్సర్ ఉంటుంది. ఆ వాహనం రోడ్లపై తిరుగుతూ డీజిల్ సరఫరా చేస్తూ ఉంటుంది. ఈ సేవలు కమర్షియల్ వాహనాలకు బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

  కేవలం కమర్షియల్ వాహనాలు మాత్రమే కాదు... ఫ్యూయెల్ స్టేషన్స్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు కూడా ఈ సేవలు ఉపయోగపడున్నాయి. అంతేకాదు... అత్యవసర సమయాల్లోనూ ఈ వాహనం అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు మొబైల్ యాప్ ద్వారా డీజిల్ ఆర్డర్ చేస్తే ఈ వాహనం వచ్చి డెలివరీ చేస్తుంది. అయితే కనీసం 200 లీటర్ల డీజిల్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 2,500 లీటర్ల కన్నా ఎక్కువ ఆర్డర్ చేసినవాళ్ల దగ్గర PESO లైసెన్స్ తప్పనిసరి.

  డీజిల్ కన్నా పెట్రోల్‌కు మండే స్వభావం ఎక్కువ కాబట్టి కేవలం డీజిల్‌ను మాత్రమే హోమ్ డెలివరీ చేస్తోంది ఇండియన్ ఆయిల్. ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్ల ఏర్పాటు లాంటి భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంది ఐఓసీ.

  ఇవి కూడా చదవండి:

  లైఫ్ ఇన్స్యూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? తెలుసుకోండి

  ఈ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదు... ఆ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా?

  #Reminder: 2019లో మీరు గుర్తుంచుకోవాల్సిన డెడ్‌లైన్స్ ఇవే...

  IRCTC వెబ్‌సైట్ మారింది... కొత్త ఫీచర్లు ఇవే
  First published: