Budget 2022: మంగళవారం పార్లమెంటులో బడ్జెట్ను సమర్పిస్తూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1,486 కేంద్ర చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'ని ప్రోత్సహించడానికి మరో 1,486 కేంద్ర చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నిర్మలా సీతారామన్, గత రెండేళ్లలో ప్రభుత్వం ఇప్పటికే చట్టాలకు సంబంధించిన 25,000కు పైగా కంప్లైంట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తరపున తెలియజేశారు. "ఈ నిబంధనలను రద్దు చేయడం వల్ల ప్రజలపై మాకున్న నమ్మకాన్ని , ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మెరుగుదల చూపిస్తుంది" అని ఆమె అన్నారు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, తదుపరి దశ ఈజ్ ఆఫ్ లివింగ్ తమ లక్ష్యమని తెలిపారు.
1,486 కేంద్ర చట్టాలను రద్దు చేయడం ద్వారా ప్రజలు తమ వ్యాపారాలను ప్రారంభించడం సులభతరం అవుతుందని నిపుణులు అంటున్నారు. చిన్న చిన్న విషయాలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఎక్కువ సంఖ్యలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడమే కాకుండా ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్లో భారత్ స్థానం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల విలువైన బాండ్లను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పార్లమెంటులో సమర్పించిన బడ్జెట్ పత్రం చూపుతోంది. వాస్తవానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మొత్తం వ్యయం రూ.39.45 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. పోల్చి చూస్తే, పన్నుతో సహా అన్ని వనరుల నుంచి ప్రభుత్వానికి అందిన మొత్తం రూ.22.84 లక్షల కోట్లు. ఈ విధంగా, ఖర్చు , ఆదాయాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం మార్కెట్ నుండి బాండ్ల ద్వారా రుణం తీసుకుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2022, Budget 2022-23, Nirmala sitharaman, Union Budget 2022