హోమ్ /వార్తలు /బిజినెస్ /

Disney LayOffs: ఆఖరికి డిస్నీ కూడా ఉద్యోగులను తీసేసింది.. 7 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటన

Disney LayOffs: ఆఖరికి డిస్నీ కూడా ఉద్యోగులను తీసేసింది.. 7 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Disney LayOffs: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులకు కఠిన పరిస్థితులు నెలకొన్నాయి. బడా కార్పొరేట్ కంపెనీల్లో ‘లే ఆఫ్’ల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ‘డిస్నీ’(Disney) చేరింది. సంస్థలోని 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Disney LayOffs:  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులకు కఠిన పరిస్థితులు నెలకొన్నాయి. బడా కార్పొరేట్ కంపెనీల్లో ‘లే ఆఫ్’ల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ‘డిస్నీ’(Disney) చేరింది. సంస్థలోని 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తప్పక తీసుకోవాల్సి వస్తోందని డిస్నీ వెల్లడించింది. ఈ మేరకు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) బాబ్ ఇగర్ ప్రకటన విడుదల చేశారు.

* వేటు వేయక తప్పడం లేదు

డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ పనితీరును విశ్లేషించిన అనంతరం డిస్నీ సీఈవో బాబ్ ఇగర్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ‘లే ఆఫ్’లు విధించాలన్న నిర్ణయం తేలికగా తీసుకున్నది కాదని ఇగర్ వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇలా చర్యలు తీసుకోవడం తప్పనిసరి అంటూ ఇగర్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులపై తనకు ఎంతో గౌరవం ఉందంటూ నొక్కి చెప్పారు. ఉద్యోగుల టాలెంట్, అంకితభావానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే అంటూ ఇగర్ కొనియాడారు. అయితే, భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా 7 వేల మంది ఉద్యోగులపై వేటు వేయక తప్పడం లేదని స్పష్టం చేశారు.

* వీటిపై ఫోకస్

వచ్చే కొన్నేళ్లలో కంటెంట్ ద్వారా భారీ మొత్తంలో జమ చేయాలని డిస్నీ భావిస్తోంది. స్పోర్ట్స్‌ని మినహాయించి మిగతా కంటెంట్ ద్వారా దాదాపు 3బిలియన్ డాలర్లు సేవింగ్స్ చేయాలని చూస్తోంది. ఇదే విషయంపై సీఈవో ఇగర్ ప్రస్తావించారు. కంపెనీని రీ ఆర్గనైజ్ చేయాల్సి ఉందని తెలిపారు. ముఖ్యంగా మూడు విభాగాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఈఎస్‌పీఎన్(ESPN), డిస్నీ పార్క్స్, ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ప్రొడక్ట్స్‌లపై ఫోకస్ పెట్టనున్నట్లు సీఈవో స్పష్టం చేశారు. ఈ ధోరణి వల్ల ప్రస్తుత పోటీ ప్రపంచంలో మరింత ప్రభావవంతంగా పనిచేయ గలుగుతామని ఇగర్ వెల్లడించారు. 5.5బిలియన్ డాలర్ల సేవింగ్స్ లక్ష్యంగా కంపెనీ కృషి చేయనున్నట్లు తెలిపారు.

* సబ్‌స్క్రైబర్స్ పెరిగినా తప్పని చర్యలు

డిస్నీ సంస్థ స్ట్రీమింగ్ బిజినెస్‌లో గడిచిన త్రైమాసికంలో 1.5బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2024 చివరికల్లా డిస్నీ ప్లస్ సంస్థ లాభాల్లోకి వస్తుందని అంచనా. హాట్‌స్టార్ మినహాయించి డిస్నీ ప్లస్‌కు అమెరికా, కెనడాల్లో సబ్‌స్క్రైబర్లు పెరిగారు. 2లక్షల మంది సబ్‌స్క్రైబర్లు అదనంగా చేరడంతో మొత్తం చందాదారుల సంఖ్య 4.66కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ కంపెనీ నష్టాలను చవిచూడటం గమనార్హం.

* ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన

అమెరికాలో ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో బడా బడా కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకోవాలని ఉన్నఫలంగా ఎంప్లాయిస్‌కి గుడ్‌బై చెబుతున్నాయి. గూగుల్ , మైక్రోసాఫ్ట్, మెటా, ఐబీఎం, ఇన్ఫోసిస్, ఇలా ప్రధాన కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగించాయి. ఈ తొలగింపులోనూ పోటీ పడ్డట్లు వ్యవహరించాయి. అమెజాన్ ఏకంగా 18 వేల మందిని తీసేసింది. గూగుల్ 12వేల మందిపై వేటు వేసింది. మైక్రోసాఫ్ట్ 10వేలు, మెటా 11వేలు, సేల్స్‌ఫోర్స్ 7వేలు.. ఇలా భారీ మొత్తంలో ఉద్యోగాలను తొలగించాయి. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

Key Words

First published:

Tags: Business, Disney, Technology

ఉత్తమ కథలు