Home /News /business /

NOW CUSTOMERS CAN REDEEM PAYTM GOLD AT JEWELLERY STORES KNOW HOW SS

Paytm Gold: పేటీఎం గోల్డ్‌తో బంగారం షాపులో నగలు కొనొచ్చు

Paytm Gold: పేటీఎం గోల్డ్‌తో బంగారం షాపులో నగలు కొనొచ్చు

Paytm Gold: పేటీఎం గోల్డ్‌తో బంగారం షాపులో నగలు కొనొచ్చు

Paytm Gold | పేటీఎం గోల్డ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసేవారికి 5% గోల్డ్ బ్యాక్ స్కీమ్ వర్తిస్తుంది. ప్రస్తుతం 100 పైగా షాపుల్లో ఈ సదుపాయం ఉంది.

    పేటీఎంలో దాచుకున్న డిజిటల్ గోల్డ్‌ను ఇప్పుడు నగల షాపులో రీడీమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని నగల షాపులతో ఒప్పందం కుదుర్చుకుంది పేటీఎం. కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, పీసీ జ్యువెలర్, సెన్కో గోల్డ్ & డైమండ్స్ దుకాణాల్లో పేటీఎం డిజిటల్ గోల్డ్‌ను రీడీమ్ చేసి నగలు కొనొచ్చు. అంటే... పేటీఎంలో ఎంత డిజిటల్ గోల్డ్ ఉందో అంతే మొత్తానికి నగలు తీసుకోవచ్చు. అంతేకాదు... పేటీఎం గోల్డ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసేవారికి 5% గోల్డ్ బ్యాక్ స్కీమ్ వర్తిస్తుంది. ప్రస్తుతం 100 పైగా షాపుల్లో ఈ సదుపాయం ఉంది. 20 రోజుల్లో మరో 250 స్టోర్స్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది పేటీఎం. ఫెస్టివల్ సీజన్‌లో పేటీఎం గోల్డ్ అమ్మకాలు మూడు రెట్లు పెంచుకోవాలని భావిస్తోంది కంపెనీ.

    మొబైల్ వ్యాలెట్ కంపెనీ పేటీఎం రెండేళ్ల క్రితం డిజిటల్ గోల్డ్ స్కీమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒక్క రూపాయి నుంచి ఎన్ని వేల రూపాయల వరకైనా డిజిటల్ గోల్డ్‌లో భద్రపర్చుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడింది. 3 కోట్ల మంది కస్టమర్లు 4.2 టన్నుల పేటీఎం గోల్డ్ కొన్నట్టు కంపెనీ ప్రకటించింది. డిజిటల్ గోల్డ్ మార్కెట్‌లో పేటీఎం వాటానే 70% ఉండటం విశేషం. ఇన్నాళ్లూ యూజర్లు దాచుకున్న డిజిటల్ గోల్డ్‌ను ఇప్పుడు రీడీమ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది పేటీఎం. ఉచితంగా బీమా ఉన్న లాకర్స్, మార్కెట్‌ ధర, 25,000 పిన్ కోడ్‌లకు డెలివరీ, గోల్డ్ సేవింగ్స్ ప్లాన్, గోల్డ్ గిఫ్టింగ్ లాంటి సదుపాయాలను అందిస్తోంది పేటీఎం గోల్డ్.

    అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Google Apps: గూగుల్ నుంచి 5 కొత్త యాప్స్... ప్రత్యేకతలివే

    Dhanteras 2019: ధంతేరాస్‌కు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి

    Gold Bond: మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే బంగారం... కొనండి ఇలా
    First published:

    Tags: Dhanteras gold, Gold, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rates, Paytm

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు