Nothing Ear 1 buds: వన్‌ప్లస్ మాజీ సీఈవో కార్ల్ పీకి చెందిన ‘నథింగ్’ సంస్థ నుంచి జులై నెలలో తొలి ఇయర్‌బడ్ మార్కెట్లోకి రిలీజైన సంగతి తెలిసిందే. నథింగ్ 1 వైర్లెస్ ఇయర్‌బడ్స్ పేరుతో భారత మార్కెట్లోకి విడుదలైన మొదటి ప్రోడక్ట్ ఇదే కావడం విశేషం. అయితే నథింగ్ సంస్థ ఇప్పుడు భారతీయ వినియోగదారులకు పెద్ద షాకిచ్చింది. తమ ఇయర్ 1 వైర్లెస్ ఇయర్‌బడ్స్ ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం రూ. 5999 వద్ద అందుబాటులో ఉన్న ఈ ఇయర్‌బడ్స్ నవంబర్ 10 నుంచి రూ. 6999 వద్ద లభిస్తుందని తెలిపింది. అంటే దాదాపు రూ. 1000 ధర పెరుగుతుందని చెప్పవచ్చు.
నథింగ్ ప్రీమియం బ్రాండ్ అయినప్పటికీ, భారతీయ యూజర్ల కోసం దీన్ని బడ్జెట్ ధరలోనే విడుదల చేశారు. కేవలం రూ. 5,999 ధర వద్ద ఈ ఇయర్ బడ్ లాంచ్ అయ్యింది. అయితే విదేశీ మార్కెట్లో మాత్రం ఇది సుమారు రూ. 8700 వద్ద అందుబాటులో ఉంది. ప్రస్తుతం యుఎస్‌లో $ 99, ఐరోపాలో € 99, యూకేలో £ 99 ధర వద్ద లభిస్తుంది. అంటే, గ్లోబల్ మార్కెట్ ధరకు ఇండియన్ మార్కెట్ ధరకు రూ. 2700 తేడా ఉందని స్పష్టమవుతోంది. భారత మార్కెట్ చాలా పెద్దది కాబట్టి, ఇక్కడ పెద్ద మార్కెట్‌ను సొంతం చేసుకుంటే గ్లోబల్ మార్కెట్లో గణనీయమైన లాభాలు పొందవచ్చన్న ఉద్దేశంతో దీన్ని తక్కువ ధరకే విక్రయిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో బంపరాఫర్..
నవంబర్ 10 నుంచి ఇయర్ 1 వైర్లెస్ ఇయర్‌బడ్స్ ధరను రూ. 6,999 వరకు పెంచుతున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. కాంపోనెంట్స్, ప్రొడక్షన్ ప్రాసెస్ల ధరల పెరుగుదలతో ఇయర్‌బడ్స్ ధర పెంచాల్సిన అనివార్యత ఏర్పడిందని కంపెనీ తెలిపింది. అయితే కస్టమర్లు ఇప్పటికే ఉన్న స్టాక్‌ను రూ. 5,999 కి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద దీన్ని రూ .5,499 ధరకే కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులపై మరిన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ దివాళి సేల్ ఆఫర్ అక్టోబర్ 23న ముగుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Technology