Bank Account: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయొద్దు

Bank Account Closure | మీరు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన 14 రోజుల్లో క్లోజ్ చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత క్లోజ్ చేస్తే మాత్రం ఛార్జీలుంటాయి.

news18-telugu
Updated: September 18, 2019, 3:58 PM IST
Bank Account: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయొద్దు
Bank Account: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయొద్దు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 18, 2019, 3:58 PM IST
ఒక్కొక్కరు మూడు, నాలుగు బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేయడం ఈ రోజుల్లో మామూలైపోయింది. సాలరీ అకౌంట్, పర్సనల్ అకౌంట్, ఉద్యోగం మారితే మరో అకౌంట్, వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్ అయితే ఇంకో అకౌంట్ ఇలా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తుండటం సర్వసాధారణమే. అయితే వేర్వేరు అకౌంట్లు మెయింటైన్ చేయడం వల్ల వాటిలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయక తప్పదు. మీ దగ్గర జీరో బ్యాలెన్స్ సాలరీ అకౌంట్ అయినా, కొన్ని నెలలు అందులో సాలరీ క్రెడిట్ కాకపోతే రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌గా మారిపోతుంది. అప్పుడు నాన్-సాలరీ సేవింగ్స్ అకౌంట్ కాబట్టి మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే ఏవేవో ఛార్జీలు చెల్లించక తప్పదు. అందుకే మీరు సాలరీ అకౌంట్‌ని సేవింగ్స్ అకౌంట్‌గా ఉపయోగించకపోతే క్లోజ్ చేయడం మంచిది. మరి మీరు బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటే ఈ విషయాలు మర్చిపోవద్దు.

మీరు అకౌంట్ ఓపెన్ చేసినంత ఈజీ కాదు క్లోజ్ చేయడం. దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మీరు మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసే ముందు ఆటో డెబిట్స్ అన్నీ ఆపెయ్యాలి. ఏదైనా ట్రేడింగ్ అకౌంట్‌కు ఈ అకౌంట్ లింక్ చేసినట్టైతే డీ-లింక్ చేయాలి. ఏవైనా క్రెడిట్ కార్డులకు మీ అకౌంట్ లింక్ చేసినట్టైతే డీ-లింక్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఏవైనా ఈఎంఐలు, రికరింగ్ డిపాజిట్లకు ఈ అకౌంట్ నెంబర్ ఇచ్చినట్టైతే కొత్త అకౌంట్ నెంబర్‌కు మార్చాలి. ఇవన్నీ డీలింక్ చేయడానికి కనీసం 10 రోజుల సమయం పడుతుంది. ఇవన్నీ పూర్తైన తర్వాత అకౌంట్ క్లోజ్ చేయడానికి బ్యాంకుకు వెళ్లాలి. బ్యాంక్ బ్రాంచ్‌లో మీకు అకౌంట్ క్లోజర్ ఫామ్ లభిస్తుంది. ఆ దరఖాస్తుకు డీలింకింగ్ ఫామ్, చెక్ బుక్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అకౌంట్ ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి. మీరు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన 14 రోజుల్లో క్లోజ్ చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత క్లోజ్ చేస్తే మాత్రం ఛార్జీలుంటాయి.

మీ అకౌంట్ వివరాలు, అకౌంట్ క్లోజ్ చేయడానికి గల కారణాలతో బ్రాంచ్ మేనేజర్‌కు లెటర్ సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ మీది జాయింట్ అకౌంట్ అయితే ఇద్దరి సంతకాలు తప్పనిసరి. మీ అకౌంట్‌లో అప్పటికే ఉన్న డబ్బుల్నిట్రాన్స్‌ఫర్ చేసేందుకు మరో అకౌంట్ నెంబర్ ఇవ్వడం మర్చిపోవద్దు. నెఫ్ట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ కోరొచ్చు. లేదా డీడీ అడగొచ్చు. ఒకవేళ రూ.20,000 లోపు బ్యాలెన్స్ ఉంటే నగదు తీసుకోవచ్చు. మీ అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత చివరి స్టేట్‌మెంట్‌ను దగ్గర పెట్టుకోవడం మర్చిపోవద్దు. మీ అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత కొత్త అకౌంట్ వివరాలు అవసరమైనచోట అప్‌డేట్ చేయాలి.

Personal Finance: మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:
Loading...
Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ తప్పులతో తిప్పలే

SBI Alert: ఎస్‌బీఐ కార్డు వాడుతున్నారా? ఈ విషయాలు గుర్తున్నాయా?

Post Office Scheme: ప్రతీ నెలా ఆదాయం కావాలా? ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి
First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...