• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • NOT TO MENTION THE DETAILS OF THESE IN THE IT RETURNS BUT BEWARE THE NOTICES WILL COME MK GH

ఐటీ రిటర్నుల్లో వీటి వివరాలు చెప్పలేదా...అయితే నోటీసులు వస్తాయి జాగ్రత్త..

ఐటీ రిటర్నుల్లో వీటి వివరాలు చెప్పలేదా...అయితే నోటీసులు వస్తాయి జాగ్రత్త..

ప్రతీకాత్మకచిత్రం

ఆదాయపు పన్ను రిటర్నుల్లో అన్ని వివరాలను బహిర్గత పరచలేదని ఆదాయపు పన్ను శాఖ గమనించింది. ఎవరైతే వివరాలను వెల్లడించలేదో వారికి నోటీసులను పంపనుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా సమర్పించిన ఐటీఆర్ ఫైల్ పునఃపరిశీలించి తిరిగి సమర్పించాలని పన్ను చెల్లింపుదారులను ఆదేశించింది.

  • Share this:
పన్ను చెల్లింపుదారులు ఆదయపు పన్ను రిటర్ను(ITR) దాఖలు చేయడానికి ఈ రోజే ఆఖరు తేదీ. నేటితో 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ గడువు ముగియనుంది. ఈనేపథ్యంలో చాలా మంది తమ ఆదాయపు పన్ను రిటర్నుల్లో అన్ని వివరాలను బహిర్గత పరచలేదని ఆదాయపు పన్ను శాఖ గమనించింది. ఎవరైతే వివరాలను వెల్లడించలేదో వారికి నోటీసులను పంపనుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా సమర్పించిన ఐటీఆర్ ఫైల్ పునఃపరిశీలించి తిరిగి సమర్పించాలని పన్ను చెల్లింపుదారులను ఆదేశించింది.

"అసెస్మెంట్ ఇయర్ 2020-21(2019-20 ఆర్థిక సంవత్సరానికి) ఆదాయపు పన్ను రిటర్నుల్లో అధిక విలువ సమచారాన్ని బహిర్గత పరచలేదని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. కాబట్టి ఐటీఆర్ సవరించి ఆన్ లైన్ పోర్టల్లో తిరిగి సమర్పించండి. కంప్లయెన్స్ పోర్టల్(సీపీ) ద్వారా ఆన్ లైన్ సవరించింవచ్చు. ఇ-ఫైలింగ్ లాగిన్ పోర్టల్లోకి లాగిన్ అవ్వడం ద్వారా సీపీని యాక్సెస్ చేయవచ్చు. అనంతరం మై అకౌంట్ లేదా కంప్లైయెన్స్ ట్యాబ్ ఐటీడీ కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయాలి" అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఐటీ నోటీసులు స్వీకరించడానికి పలు కారణాలు ఉన్నాయి. ఫిక్సెడ్ డిపాజిట్ల వడ్డీ, సేవింగ్స్ బ్యాంకు ఖాతా వడ్డీలను ఐటీఆర్ లో పేర్కొనకపోవడం ఇందులో ప్రధానమైనవి. బ్యాంకు అందించిన డేటాతో ఐటీఆర్లో దాఖలు చేసిన సమాచారం సరిపోలకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపిస్తుంది. అయితే అంత మాత్రాన పన్ను చెల్లింపుదారులు మోసానికి పాల్పడినట్లు కాదు. ఇందుకు గల కారణాన్ని అతడు ఐటీ విభాగానికి స్పష్టం చేయాలి లేదా ఐటీఆర్ ను సవరించాలి.

బ్యాంకులు ప్రతి ఏడాది యానువల్ ఇన్ఫర్మేషన్ రిటర్ను(వార్షిక సమాచార రిటర్ను) దాఖలు చేస్తాయి. ఇవి ఫిక్సెడ్ డిపాజిట్లు లాంటి హై వ్యాల్యూ లావాదేవీల వివరాలను కలిగి ఉంటాయి. ఈ AIR డేటాతో మదింపు దారు సమర్పించిన డేటాను ఐటీఆర్ సరిపోల్చి చూస్తుంది. ఈ పోలికల ఆధారంగా ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారులకు సందేశాలు, ఈమెయిళ్లను పంపుతోందని, గత కొన్ని రోజులగా తన క్లయింట్లలో చాలా మందికి ఇలాంటి సందేశాలు వచ్చాయని ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్ అంకిత్ గుప్తా చెప్పారు.

ఈ సమస్యను ఎలా అధిగమించాలి..
"ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. పన్ను చెల్లింపుదారుడు నోటీసును విస్మరించకూడదు. దీనికి వెంటనే ఆదాయపు పన్ను శాఖ సూచించిన విధానంలో ప్రతిస్పందించాలి. ఆదాయ, పన్ను రుజువులకు డిమాండ్ ఉన్నప్పటికీ మీరు మీ గడువు తేదీకి కట్టుబడాల్సి ఉంటుంది. నోటీసులో చట్టబద్ధమైన అంశాల గురించి మీరు పోరాడుతుంటే ఆలస్యం చేయకుండా పన్ను సలహాదారుని సంప్రదించడం మంచిది. గడువులో మీరు వెంటనే ప్రతిస్పందనను తెలపాలి. ప్రస్తుతం కరస్పాండెన్స్ ఈమెయిళ్ల రూపంలో జరుగుతుంది కాబట్టి అసెస్మెంట్ ఆఫీసర్ తో ముఖాముఖిగా మాట్లాడాల్సిన అవసరం లేదు" అని బ్యాంక్ బజార్ సహా వ్యవస్థాపకుడు అధీల్ శెట్టి అన్నారు.
"అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు పన్ను చెల్లింపుదారుడు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ సందర్శించి అక్కడి రికార్డులను ధ్రువీకరించవచ్చు. అందులో ఉన్న సమాచారం సరైనది అయితే వాటిని అంగీకరించి సవరించిన ఐటీఆర్ ను 2021 మార్చి 31 లోపు తిరిగి దాఖలు చేయాల్సి ఉంటుంది. డూప్లికేట్ ఎంట్రీలు నమోదు చేసిన కొన్ని సందర్భాలు కూడా ఇక్కడ ఉండవచ్చు. అక్కడ ఏదైనా డూప్లికేట్ ఎంట్రీని మదింపుదారుడు గమనించినట్లయితే ఆదాయపు పన్ను పోర్టల్లో డూప్లికేట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి డూప్లికేట్ ఆప్షన్ మినహాయించి ఇతర ఎంట్రీలతో సహా ఐటీఆర్ సవరించి తిరిగి ఫైల్ చేయండి" అని అంకిత్ గుప్తా స్పష్టం చేశారు.
First published:

అగ్ర కథనాలు