news18-telugu
Updated: January 1, 2019, 1:35 PM IST
Budget 2019: గత బడ్జెట్లో 5 ముఖ్యమైన పన్ను సంస్కరణలివే
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేశాం. 2019 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికాం. ఇక పన్నుల విషయంలో జాగ్రత్తపడాల్సిన సమయం ఇది. ఇప్పట్నుంచే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే మీ పన్నుల్ని వీలైనంతవరకు తగ్గించుకోవచ్చు. ట్యాక్స్ ప్లానింగ్ అనేది రాత్రికి రాత్రి చేసేది కాదు. అది ఏడాది అంతా జరిగే ప్రక్రియ. కానీ చాలామంది గడువు దగ్గరపడేవరకు వేచి చూస్తారు. చివరి నిమిషంలో కంగారుపడుతుంటారు. ఎంత ముందుగా ట్యాక్స్ సేవింగ్స్ చేస్తే అంత మంచిది. మరి మీరూ ఈ ఏడాదికి సంబంధించి ట్యాక్స్ సేవింగ్ మొదలుపెట్టలేదా? మరి ఆలస్యం చేయకుండా మీ పన్నుల్ని ఎలా ఆదా చేయాలో తెలుసుకోండి.
లైఫ్ ఇన్స్యూరెన్స్ టర్మ్ ప్లాన్మీకు తగిన జీవిత బీమా ఇప్పటివరకు తీసుకోలేదా? అయితే మీ కుటుంబం రిస్క్‌లో ఉన్నట్టే. టర్మ్ పాలసీ తీసుకుంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ బెన్ఫిట్స్ లేకుండా ఇన్స్యూరెన్స్ కవర్ మాత్రమే అందిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. మీరు ఆఫ్‌లైన్‌లో టర్మ్ పాలసీ తీసుకుంటే ఏజెంట్ ప్రమేయం ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ చెల్లించాలి. ఆన్లైన్లో తీసుకుంటే ప్రాసెస్ వేగంగా ఉంటుంది. డబ్బు ఆదా అవుతుంది.
ఈఎల్ఎస్ఎస్- ట్యాక్స్ సేవింగ్ ఫండ్
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అనేది ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే ఇందులో లాక్-ఇన్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులపై రిటర్న్స్ ఈక్విటీ మార్కెట్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీలో కేవైసీ పూర్తి చేసి ఉంటే ఆన్లైన్లోనే ఈఎల్ఎస్ఎస్ తీసుకోవచ్చు. సిప్ లేదా ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టొచ్చు. పన్ను ఆదా చేయడానికి చివరి నిమిషంలో అయితే ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడం మంచిది. మూడేళ్ల తర్వాత ఈఎల్ఎస్ఎస్పై వచ్చే రిటర్న్స్‌లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ట్యూషన్ ఫీజు లేదా ఎడ్యుకేషన్ లోన్‌పై వడ్డీ
మీ పిల్లల ట్యూషన్ ఫీజు చెల్లించడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే ఆ స్కూల్ లేదా కాలేజీ భారతదేశంలో ఉండాలి. నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసి ఉండాలి. ఇద్దరు పిల్లల వరకే ట్యూషన్ ఫీజు అనుమతిస్తారు. మీ పిల్లల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నట్టయితే సెక్షన్ 80ఈ కింద ఆ ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన వడ్డీకి మినహాయింపు పొందొచ్చు.
ఆరోగ్య బీమా
60 ఏళ్ల లోపు వ్యక్తులు వ్యక్తిగతంగా, భార్యాపిల్లలకు కలిపి తీసుకునే ఆరోగ్య బీమాపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద రూ.25,000 వరకు ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపులు పొందొచ్చు. సీనియర్ సిటిజన్లకు అయితే రూ.50,000 వరకు మినహాయింపు లభిస్తుంది. మీరూ, మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ కేటగిరీలోకి వస్తే రూ.60,000 వరకు మినహాయింపులు వస్తాయి.
ఎన్పీఎస్
సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో పెట్టుబడి ద్వారా రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులపై లాభాలు రిటైర్మెంట్ తర్వాత వస్తాయి.
ఇవే కాకుండా సెక్షన్ 80 సీ కింద పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ, సుకన్య సమృద్ధి యోజన లాంటి స్కీమ్‌లు ఉన్నాయి. మీ ఆర్థిక అవసరాలు, మీరు తీసుకునే రిస్క్‌ను బట్టి వీటిని ఎంచుకోవాలి.
ఇవి కూడా చదవండి:
క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే ఎన్నెన్నో లాభాలు... తెలుసుకోండి
ALERT: ఎస్బీఐ విత్‌డ్రా, డిపాజిట్ రూల్స్ మారాయి తెలుసా?
క్రెడిట్ కార్డ్ లిమిట్ మరీ ఎక్కువగా వాడేస్తున్నారా? అయితే రిస్కే
మీ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసా?
Published by:
Santhosh Kumar S
First published:
January 1, 2019, 10:55 AM IST