NOT FORCING ANYONE TO USE APP USERS FREE TO LEAVE WHATSAPP TELLS DELHI HIGH COURT MK GH
WhatsApp privacy policy: ప్రైవసీ పాలసీపై వాట్సాప్ కొత్త వాదన.. మెరుగైన సేవలు అందిస్తున్నామంటున్న సంస్థ
(ప్రతీకాత్మక చిత్రం)
మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’కు చెందిన ప్రైవసీ పాలసీ వివాదం మళ్లీ మొదలైంది. గతేడాది యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొంతకాలం దీన్ని వాయిదా వేసిన వాట్సాప్.. మళ్లీ కొత్తగా అప్డేటెడ్ పాలసీని తెచ్చింది. దాన్ని అంగీకరించాలని యూజర్లకు సూచిస్తోంది.
మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’కు చెందిన ప్రైవసీ పాలసీ వివాదం మళ్లీ మొదలైంది. గతేడాది యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొంతకాలం దీన్ని వాయిదా వేసిన వాట్సాప్.. మళ్లీ కొత్తగా అప్డేటెడ్ పాలసీని తెచ్చింది. దాన్ని అంగీకరించాలని యూజర్లకు సూచిస్తోంది. దీంతో వ్యక్తిగత గోప్యతపై వాట్సాప్ యాజర్లకు మళ్లీ ఆందోళన మొదలైంది. పర్సనల్ మెసేజ్‌లు, చాట్లు, డేటా.. వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు చెందిన కంపెనీల చేతికి వెళతాయేమోనని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రైవసీ పాలసీపై ఢిల్లీ హైకోర్టులో ఓ పిల్ సైతం దాఖలైంది. దీనిపై వాట్సాప్ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. వివరాలను న్యాయస్థానానికి సమర్పించింది. కొత్త అప్డెటెడ్ పాలసీ వల్ల యూజర్ల గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని చెప్పింది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో పాటు పర్సనల్‌గా ఎవరికి మెసేజ్‌లు చేసుకున్నా వాటిపై ఎలాంటి ప్రభావం ఉందని స్పష్టం చేసింది.
అలాగే చాలా యాప్‌ల కంటే వాట్సాప్ చాలా పాదర్శకంగా ఉందని వాట్సాప్ తెలిపింది. తమ యాప్ వాడాలని ఎవరినీ బలవంతం చేయడం లేదని, యూజర్లు వద్దనుకుంటే యాప్‌ను వాడొద్దని చెప్పింది. ప్రైవసీ పాలసీని యూజర్లు కచ్చితంగా అంగీకరించాలన్న నిబంధన పెట్టలేదని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వాట్సాప్ చెప్పింది. ఇష్టం లేకుంటే పాలసీని అంగీకరించకుండానే యూజర్లు యాప్‌ను వాడుకునేలా సదుపాయం కల్పించామని తెలిపింది. ప్రైవసీ పాలసీపై యూజర్లదే నిర్ణయమని వివరించింది.
ఇదే క్రమంలో వాట్సాప్ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. చాలా యాప్‌లకు ఇదివరకే ఉన్న ప్రైవసీ పాలసీ లాంటిదే తామూ తీసుకొచ్చామని కోర్టుకు చెప్పింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, జొమాటో, ఓలా క్యాబ్స్, ట్రూకాలర్, బిగ్‌బాస్కెట్, కూతో పాటు ప్రభుత్వ యాప్‌లు ఆరోగ్య సేతు, భీమ్, ఎయిర్ ఇండియా, సందేశ్, ఐఆర్టీసీ యాప్‌లు ఆడిగేలాంటి ప్రైవసీ పాలసీనే తామూ రూపొందించామని న్యాయస్థానానికి తెలిపింది.
కాగా, వాట్సాప్‌పై ఢిల్లీ హైకోర్టులో డాక్టర్ సీమాసింగ్ పిటిషన్ వేశారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీ ద్వారా యూజర్ల గోప్యత హక్కుకు భంగం కలుగుతుందని ఈ కేసును వాదించిన లాయర్ విక్రమ్ సింగ్ న్యాయస్థానానికి తెలిపారు.
మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్‌కు చెందిన కంపెనీలకు యూజర్ల డేటా చేరవేసేలా వాట్సాప్ పాత ప్రైవసీ పాలసీ ఉందని, కొత్త పాలసీ సైతం ఎలాంటి భద్రత కల్పించేలా లేదని ఆయన చెప్పారు. దీంతో కేంద్ర ప్రభుత్వం, వాట్సాప్, ఫేస్‌బుక్‌లు ఈ విషయంపై స్పందించాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీంతో తాజాగా వాట్సాప్ అఫిడవిట్ దాఖలు చేసింది. తమ కొత్త ప్రైవసీ పాలసీని సమర్థించుకుంది. వాట్సాప్ యూజర్ల డేటాకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. మరోవైపు వాట్సాప్ ప్రైవసీ పాలసీని తెచ్చాక చాలా మంది యూజర్లు వేరే యాప్‌ల వైపు వెళ్లారు. సిగ్నల్, టెలీగ్రామ్‌తో పాటు మరికొన్ని ప్రత్యామ్నాయ మెసేజింగ్ యాప్‌లకు మారారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.