హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tesla-Bitcoin: టెస్లా కార్ల వ్యాపారం కంటే బిట్‌కాయిన్స్‌ ద్వారా ఎక్కువ సంపాదిస్తున్న ఎలాన్ మస్క్‌

Tesla-Bitcoin: టెస్లా కార్ల వ్యాపారం కంటే బిట్‌కాయిన్స్‌ ద్వారా ఎక్కువ సంపాదిస్తున్న ఎలాన్ మస్క్‌

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Elon Musk : ఇటీవల విడుదలైన టెస్లా తొలి త్రైమాసిక ఫలితాల ద్వారా ఈ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఫస్ట్‌ క్వార్టర్‌లో టెస్లా ఆదాయం 10.4 బిలియన్‌ డాలర్లుగా ప్రకటించింది. అలాగే ఎడ్జెస్టెడ్ ఎర్నింగ్స్‌ 93 సెంట్స్‌గా వెల్లడించింది. నెట్‌ ఆదాయం 438 మిలియన్‌ డాలర్లుగా ఉంది.

ఇంకా చదవండి ...

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్ (Elon Musk) పట్టిందల్లా బంగారంగా మారుతోంది. ఆయన ఏ పని చేసినా అందులో విజయమే దక్కుతోంది. ప్రస్తుతం అసలు బిజినెస్‌తో పోలిస్తే ఇతర మార్గాల ద్వారానే మస్క్ ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఇటీవల విడుదలైన టెస్లా తొలి త్రైమాసిక ఫలితాల ద్వారా ఈ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఫస్ట్‌ క్వార్టర్‌లో టెస్లా ఆదాయం 10.4 బిలియన్‌ డాలర్లుగా ప్రకటించింది. అలాగే ఎడ్జెస్టెడ్ ఎర్నింగ్స్‌ 93 సెంట్స్‌గా వెల్లడించింది. నెట్‌ ఆదాయం 438 మిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది సంస్థ ఒక త్రైమాసికం రికార్డు మాత్రమే. అయితే ఈ ఆదాయం ముందుగా ఊహించింది కావడం గమనార్హం. ఎందుకంటే 2020తో పోల్చితే ఈ తొలి త్రైమాసికంలో 50 శాతం ఎక్కువ కార్లను అమ్ముతామని టెస్లా గతంలోనే చెప్పింది. ఆ లెక్కన ఈ సంవత్సరం టెస్లా ఎనిమిది లక్షల కార్లు డెలివరీ ఇవ్వనుంది. అయితే టెస్లా ఆదాయం కేవలం కార్లను అమ్మడం వల్లనే వచ్చింది కాదు. సంస్థ ఫిబ్రవరిలో కొనుగోలు చేసిన 1.5 బిలియన్‌ డాలర్ల బిట్‌కాయిన్స్‌ను అమ్మేసింది. వీటి ద్వారా 101 మిలియన్‌ డాలర్లు వచ్చాయి.

సంస్థ మొత్తం లాభంలో బిట్‌కాయిన్ల ఆదాయం నాలుగో వంతు కావడం ఇక్కడ గమనించాల్సిన అంశం. సోమవారం మార్కెట్లు ఓపెన్‌ అవ్వగానే టెస్లా షేర్లు పెద్దగా లాభాల్లోకి వెళ్లలేదు. జనవరిలో టెస్లా షేర్ల అత్యధిక ధర కంటే 16 శాతం తక్కువగానే ఉన్నాయి. కానీ టెస్లా మార్కెట్‌ విలువ మాత్రం 700 బిలియన్‌ డాలర్లు ఉంది. ఫోర్డ్‌ అండ్‌ జనరల్‌మోటార్స్‌ విలువ కన్నా ఇది ఐదు రెట్లు అధికం కావడం విశేషం.

టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లు ప్రస్తుతం వెస్ట్రన్‌ యూరప్‌, యూ.ఎస్‌ లాంటి ఎస్టాబ్లిష్డ్ మార్కెట్‌లో మంచి ప్రభావమే చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోక్స్‌వ్యాగన్‌, ఫోర్డ్‌, జనరల్‌ మోటార్స్‌ ఇప్పుడిప్పుడు ఈ మార్కెట్‌ వైపు వస్తున్నాయి. అయితే చైనాకు టెస్లా కాస్త ఆలస్యంగా వచ్చింది. టెస్లా కార్లలో ఉన్నడ్రైవర్‌ అసిస్టెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ లాంటి కొన్ని సమస్యలను చైనా, అమెరికాకు చెందిన రెగ్యులేటర్స్‌ ఇప్పటికే పరిశీలించాయి. అమెరికాలో ఫోర్డ్‌ ఈ తొలి త్రైమాసికంలో ఐదు లక్షలకుపైగా కార్లు అమ్మింది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా అమ్మిన కార్లకు ఇది రెండింతలు. టెస్లా ప్రస్తుత క్వార్టర్‌ జోరును మరో మూడు త్రైమాసికాలు కొనసాగిస్తే స్టాక్‌ ఈ ఏడాది ఎడ్జెస్టెడ్ ఎర్నింగ్స్‌ కంటే 200 రెట్లు ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక టెస్లా తొలి క్వార్టర్‌లో పుస్తకాలు అమ్మి 17.1 బిలియన్‌ డాలర్లు సంపాదించింది. ఇదంతా చూస్తుంటే ఎలాన్‌ మస్క్‌కు ఏ వ్యాపారంలో చిన్న దెబ్బ తగిలినా మిగిలిన వ్యాపారాలు ఆదుకుంటాయి మరి.

First published:

Tags: Bitcoin, Elon Musk, Tesla Motors

ఉత్తమ కథలు