మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? మీ దగ్గర ఏటీఎం కార్డు ఉందా? మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డును (Debti Card) కేవలం 6 సెకండ్లలో హ్యాక్ చేయొచ్చట. పేమెంట్ కార్డుల్ని హ్యాక్ చేయడానికి 'బ్రూట్ ఫోర్స్' (Brute force) అనే పద్ధతిని ఉపయోగిస్తున్నారు హ్యాకర్లు. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత సైబర్ సెక్యూరిటీ ముప్పు పెరిగిపోతోంది. ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా డిజిటల్ పద్ధతిలో జరిగిపోతుండటంతో హ్యాకర్లు కస్టమర్లను ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. NordVPN తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఓ కంప్యూటర్ సాయంతో సగటున ఓ పేమెంట్ కార్డును కేవలం ఆరు సెకండ్లలో హ్యాక్ చేయొచ్చని తేలింది. ప్రపంచవ్యాప్తంగా వీపీఎన్ సర్వీసుల్ని అందిస్తోంది NordVPN. లక్షలాది మంది ఈ సంస్థ సేవల్ని ఉపయోగిస్తున్నారు.
NordVPN సంస్థ 140 దేశాలకు చెందిన 40 లక్షల పేమెంట్ కార్డుల్ని విశ్లేషించింది. బ్రూట్ ఫోర్స్ పద్ధతి ద్వారా పేమెంట్ కార్డుల్ని హ్యాక్ చేస్తున్నట్టు తేలింది. ఇలాంటి దాడులు నమ్మశక్యం కానివని, చాలా వేగంగా జరిగిపోతాయని, కొన్ని సెకండ్ల వ్యవధిలో దాడి జరుగుతుందని తేల్చింది NordVPN. డార్క్ వెబ్‌లో కనిపించే పేమెంట్ కార్డుల్లో చాలావరకు బ్రూట్ ఫోర్సింగ్ ద్వారా సేకరించినవేనని, నేరస్థులు కార్డ్ నెంబర్, సీవీవీని సులువుగా అంచనా వేయడానికి ప్రయత్నిస్తారని NordVPN చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మరిజుస్ బ్రీడిస్ తెలిపారు.
RBI Warning: ఈ 5 రకాల మోసాలతో మీ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం... ఆర్‌బీఐ వార్నింగ్
మరిజుస్ బ్రీడిస్ చెప్పిన వివరాల ప్రకారం మొదటి 6 నుంచి 8 అంకెలు కార్డు జారీ చేసిన సంస్థకు చెందిన ఐడీ నెంబర్ ఉంటుంది. 16 అంకెల కార్డులో 7 నుంచి 9 నెంబర్లు గెస్ చేయగలిగితే చాలు. కంప్యూటర్ సాయంతో ఎటాక్ చేసి కేవలం ఆరు సెకండ్లలో నెంబర్ తెలుసుకోగలుగుతున్నారు. 9 అంకెల నెంబర్‌ని గెస్ చేస్తే కార్డు నెంబర్ పూర్తిగా తెలిసిపోతుంది. కంప్యూటర్ సాయంతో కోట్ల కాంబినేషన్లను నిమిషాల్లో గెస్ చేస్తారు. 7 అంకెల నెంబర్‌ను గెస్ చేయడానికి 6 సెకండ్లు చాలు.
Free Wi-Fi: 6,100 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై... మీరూ వాడుకోవచ్చు ఇలా
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉపయోగిస్తున్నవారు తమ కార్డులకు సంబంధించిన 12 నెలల స్టేట్‌మెంట్స్ చెక్ చేసుకోవాలి. బ్యాంకు నుంచి ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా అప్రమత్తం కావాలి. వేర్వేరు అవసరాలకు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లు ఉండాలి. అంటే మీరు ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తున్నట్టైతే ప్రత్యేకంగా ఓ అకౌంట్ ఓపెన్ చేసి అందులో కొంత మొత్తం డబ్బులు దాచుకొని ఆ అకౌంట్ నుంచే లావాదేవీలు జరపాలి. ఆన్‌లైన్ షాపింగ్ చేసేప్పుడు బ్యాంకులు అందించే వర్చువల్ కార్డ్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.