NON VEG PICKLES HOME BASED BUSINESS IDEA LOW COST BUSINESS IDEAS IN TELUGU MK
Business Ideas: కొంచం కొత్తగా ఆలోచిస్తే...ఇంటి వద్దే రోజుకు రూ.5000 ఆదాయం...
ప్రతీకాత్మకచిత్రం
Business Ideas | నాన్ వెజ్ పచ్చళ్ల బిజినెస్ ప్రస్తుతం మంచి ఆదాయం అందిస్తోంది. నాణ్యమైన సరుకులు, మంచి రుచి మెయిన్ టెయిన్ చేస్తే ఈ తరహా ఫుడ్ బిజినెస్ కాసులు కురిపిస్తుంది.
Business Ideas | నాన్‌వెజ్ ప్రియులను నాన్‌వెజ్‌ను పచ్చడి చేస్తే... నోట్లో నీళ్లు ఊరక మానదు. నాన్‌వెజ్ కూరలు, వేపుళ్లు, టిక్కాలు, కబాబ్‌లు... ఇలా ఎన్ని ఉన్నా, చికెన్, మటన్, చేపలు, రొయ్యలతో చేసే నిల్వ పచ్చళ్ల రుచిని మరచిపోలేరనడంలో ఎలాంటి సందేహం లేదు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వీటన్నింటితో కూడా మామిడి, నిమ్మ, ఉసిరి ఊరగాయాల్లాగే చేయొచ్చు. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ పచ్చళ్లను అందరూ ఇష్టపడుతున్నారు. విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్లో సైతం వీటికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా బాచిలర్స్, ఉద్యోగులు చిన్న, పెద్దా తేడా లేకుండా అంతా వీటిని తెగ ఇష్టపడతారు. అయితే నిరుద్యోగులు దీన్ని ఒక వ్యాపార అవకాశంగా చేసుకోవచ్చు. నాన్ వెజ్ పచ్చళ్ల బిజినెస్ ప్రస్తుతం మంచి ఆదాయం అందిస్తోంది. నాణ్యమైన సరుకులు, మంచి రుచి మెయిన్ టెయిన్ చేస్తే ఈ తరహా ఫుడ్ బిజినెస్ కాసులు కురిపిస్తుంది. ముందుగా నాన్ వెజ్ పచ్చళ్లతో ఆదాయం ఎలా పొందవచ్చో చూద్దాం. మార్కెట్లో ఒక కేజీ మటన్ పచ్చడి విలువ సుమారు రూ. 1000 దాకా ఉంది. అలాగే బోన్ లెస్ చికెన్ పచ్చడి ఒక కేజీ ధర రూ.800, ఒక కేజీ రొయ్యల పచ్చడి విలువ రూ.750 దాకా పలుకుతోంది. అయితే ఈ నాన్ వెజ్ పచ్చళ్ల బిజినెస్ లో సగం పెట్టుబడి కింద ఖర్చు అయిన మిగితా సగం లాభం వస్తోంది. అయితే ఈ పచ్చళ్ల బిజినెస్ తో నిరుద్యోగులు నెలకు రూ.50,000 దాకా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువతకు ఇది చక్కటి ఉపాధి వనరు అనే చెప్పాలి. మాంసం, రొయ్యలు, చేపలు ధరలు తక్కువగా ఉన్న రోజుల్లో వాటిని కొనుగోలు చేసి నిల్వ పచ్చళ్లు చేసుకుంటే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇలా నిరుద్యోగులు ఈ వ్యాపారంతో నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నారు.
నాన్ వెజ్ పికెల్స్ తయారీ బిజినెస్ లో లాభం పొందండిలా...
- ఉదాహరణకు ఒక కేజీ బోన్ లెస్ చికెన్ పచ్చడి తయారీ చేయడానికి అయ్యే ఖర్చు ఎంతో చూద్దాం...
- ఒకే కేజీ బోన్ లెస్ చికెన్ ధర..రూ.200(సీజన్ బట్టి ధర మారుతుంది)
- నూనె, కారం పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పసుపు పొడి, గరం మసాలా ఇతర ఖర్చులు కలిపి మరో రూ. 200 దాకా ఖర్చు అవుతుంది.
- ఒక కేజీ చికెన్ పచ్చడికి మీకు పెట్టుబడి రూ.400
- మార్కెట్ లో బోన్ లెస్ చికెన్ పచ్చడి ధర రూ.800 పలుకుతోంది.
- మీరు అరకేజీ, ఒక కేజీ, రెండు కేజీలు ప్యాకులుగా అమ్మినట్లయితే మీకు సుమారు ఒక కేజీ పచ్చడిపై మీకు రూ.500 దాకా ఆదాయం వస్తుంది.
- అంటే మీరు రోజుకు పది కేజీల బోన్ లెస్ చికెన్ పచ్చడి అమ్మితే మీకు సుమారు రూ.4 వేల నుంచి రూ. 5 వేల వరకూ ఆదాయం లభించే అవకాశం ఉంది.
- అలాగే మటన్, రొయ్యలు, గోంగూర మటన్, గోంగూర చికెన్ ఇలా వెరైటీలు తయారు చేసినట్లయితే మరింత లాభం వచ్చే అవకాశం ఉంది.
బిజినెస్ టిప్...
కేటరింగ్, రెస్టారెంట్లు, హోటల్స్ వారితో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటే రిటైల్ మార్కెట్ తో పాటు ఆర్డర్లు నిరంతరంగా ఉండటంతో పాటు మీకు ఆదాయం కూడా స్థిరంగా లభించే అవకాశం ఉంది. అయితే పచ్చళ్ల తయారీలో మెళకువలను నేర్చుకునేందుకు అటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటే మరింత బాగా కమర్షియల్ గా మీరు రాణించవచ్చు. ముఖ్యంగా మహిళలు సంఘాలుగా ఏర్పడి మిషినరీ ఏర్పాటు చేసుకుంటే పచ్చళ్ల ప్రొడక్షన్ కూడా పెరిగి ఆదాయం మరింత స్థిరంగా లభించే అవకాశం ఉంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.