నోకియా 6.1 స్మార్ట్ ఫోన్ ధరపై రూ.2000 తగ్గింపు...

నోకియా 6.1 మోడల్ లోని 3 జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.6999కి తగ్గింది. కాగా గతంలో ఇదే ఫోన్ ధర రూ.8999 గా ఉంది. అదే సమయంలో ఇదే మోడల్ లోని 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ వేరియంట్ ధర రూ.9999కు తగ్గింది.

news18-telugu
Updated: July 7, 2019, 10:24 PM IST
నోకియా 6.1 స్మార్ట్ ఫోన్ ధరపై రూ.2000 తగ్గింపు...
నోకియా స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గింపు
  • Share this:
భారత్ లో నోకియా 6.1 స్మార్ట్ ఫోన్ ధరలు వివిధ వేరియంట్లలో భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నోకియా 6.1 మోడల్ లోని 3 జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.6999కి తగ్గింది. కాగా గతంలో ఇదే ఫోన్ ధర రూ.8999 గా ఉంది. అదే సమయంలో ఇదే మోడల్ లోని 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ వేరియంట్ ధర రూ.9999కు తగ్గింది. కాగా గతంలో ఇదే ఫోన్ రూ. 10,999 ఉండటం విశేషం. ఇక ఈ ఫోన్ స్పెసిఫేకేషన్ల విషయానికి వస్తే 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో పాటు 3జీబీ, 4 జీబీ వేరియంట్లలో ఫోన్ లభిస్తోంది.

అలాగే ఓఎస్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ పై వెర్షన్, అలాగే 16 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 34 జీబీ, 64 జీబీ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉన్నాయి. దీంతో పాటు ఎక్స్ పాండబులు మెమరీ 128 జీబీ వరకూ పెంచుకునే వీలు కల్పించారు. దీంతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివి ఈ ఫోన్ లో ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. అలాగే ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 3000 ఎంఏహెచ్ గా అందిస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: July 7, 2019, 10:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading