హోమ్ /వార్తలు /బిజినెస్ /

Noida Twin Towers Gone: ట్విన్ టవర్స్‌ కూల్చివేతతో సూపర్‌టెక్‌కి రూ.900 కోట్ల నష్టం.. ఇప్పుడు కస్టమర్ల పరిస్థితి ఏంటి..?

Noida Twin Towers Gone: ట్విన్ టవర్స్‌ కూల్చివేతతో సూపర్‌టెక్‌కి రూ.900 కోట్ల నష్టం.. ఇప్పుడు కస్టమర్ల పరిస్థితి ఏంటి..?

Noida Twin Towers Gone

Noida Twin Towers Gone

Noida Twin Towers Gone: 9 ఏళ్లగా కొనసాగుతున్న ప్రక్రియకు ముగింపు పలుకుతూ, నోయిడాలోని ఎత్తైన సూపర్‌టెక్ ట్విన్ టవర్లను ఎట్టకేలకు ఆదివారం (ఆగస్టు 28) మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేశారు. దీనికి నెలల తరబడి సన్నాహాలు జరిగాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్ల(Supertech Twin Towers)ను విజయవంతంగా కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని, ట్విన్‌ టవర్లను కూల్చివేయాలని సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశించడంతో పనులు చేపట్టారు. కట్టడాలను కూల్చివేసిన తర్వాత తమ ఇళ్ల ముందు ఖాళీ స్థలం లభించిందని, ఇంట్లోకి గాలి, వెలుతురు వస్తున్నాయని, సంతోషంగా ఉందని సమీప నివాసితులు తెలిపారు. భవనాలను కూల్చివేసిన ప్రాంతంలో పార్కులు ఏర్పాటు చేయాలని, పచ్చదనం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇది మునుపటి ప్రణాళికలో ఉందని చెప్పారు.


అపెక్స్ (32 అంతస్తులు), సెయానే (29 అంతస్తులు) ట్విన్‌ టవర్స్‌లో తమ ఫ్లాట్‌లను బుక్ చేసుకున్న గృహ కొనుగోలుదారులు కూడా 12 శాతం వడ్డీతో వారి నగదును తిరిగి పొందుతారు. రెండు భవనాల్లో మొత్తం 915 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో 633 మంది బుక్ చేసుకున్నారు, సూపర్‌టెక్ గృహ కొనుగోలుదారుల నుంచి దాదాపు రూ.180 కోట్ల రూపాయలు వసూలు చేసింది.* సూపర్‌టెక్‌కు భారీ నష్టం
ఇప్పుడు, దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న సూపర్‌టెక్‌కు చెందిన ఇంటెరిమ్‌ రిజల్యూషన్ ప్రొఫెషనల్(IRP)ని సుప్రీం కోర్టు శుక్రవారం (ఆగస్టు 26) సెప్టెంబర్ 30లోగా సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో రూ.1 కోటి డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఫ్లాట్లు కొనుగోలు దారులకు మొత్తం రీఫండ్‌ లభిస్తుందని స్పష్టం చేసింది.


కంపెనీకి చెందిన కొందరు అధికారులు న్యూస్‌18తో మాట్లాడుతూ..‘సూపర్‌టెక్ ట్విన్ టవర్ ఏరియాలో ప్రస్తుత రియాల్టీ ధర చ.అ.కు రూ.9,000-10,000. రెండు భవనాల్లో (అపెక్స్, సెయానే) మొత్తం 915 ఫ్లాట్‌లను పరిగణనలోకి తీసుకుంటే, కంపెనీకి మొత్తం నష్టం దాదాపు రూ.800-900 కోట్లు.’ అని తెలిపారు. ఇప్పటివరకు పెట్టుబడిపై, రెండు భవనాల నిర్మాణానికి సిమెంట్, స్టీల్, ఇసుక, బ్యాంకు రుణాలు, కూలీలు, ఇతర ఖర్చులతో సహా సూపర్‌టెక్ ఇప్పటికే రూ.300-400 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.


* ప్రణాళిక మేరకు కూల్చివేత పనులు

నోయిడా సీఈవో రీతూ మహేశ్వరి మాట్లాడుతూ..‘భవనాల శిథిలాల వద్ద శుభ్రం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో గ్యాస్, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం. ప్రజలు తమ సొసైటీలలోకి ప్రవేశించడానికి అనుమతించాం.’ అని చెప్పారు.


ఇది కూడా చదవండి : వర్క్ ఫ్రం హోంకు శుభం కార్డు ప్రకటించిన ప్రముఖ ఐటీ దిగ్గజం.. దీని బాటలో మిగతా ఐటీలు..


9 ఏళ్లగా కొనసాగుతున్న ప్రక్రియకు ముగింపు పలుకుతూ, నోయిడాలోని ఎత్తైన సూపర్‌టెక్ ట్విన్ టవర్లను ఎట్టకేలకు ఆదివారం (ఆగస్టు 28) మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేశారు. దీనికి నెలల తరబడి సన్నాహాలు జరిగాయి. అపెక్స్, సెయానే భవనాల నిర్మాణం కనీస దూర నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన తర్వాత 2021 ఆగస్టులో కూల్చివేతకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కూల్చివేతకు కేవలం 9 సెకన్ల సమయం పట్టింది.


ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ కంపెనీ టవర్ల కూల్చివేతను చేపట్టింది. భవనాలను కూల్చేందుకు వాటర్‌ఫాల్‌ ఇంప్లోషన్ పద్ధతిని ఉపయోగించింది. సూపర్‌టెక్ ట్విన్ టవర్ల కూల్చివేత మధ్యాహ్నం 2:30 గంటలకు విజయవంతంగా జరిగిందని, సమీపంలోని హౌసింగ్ సొసైటీలకు ఎలాంటి నష్టం జరగలేదని నోయిడా సీఈవో రీతు మహేశ్వరి తెలిపారు. కొన్ని శిథిలాలు మాత్రమే రోడ్డు వైపు వచ్చాయని చెప్పారు. పరిస్థితి మొత్తం అదుపులోనే ఉందని వివరించారు. నోయిడా పోలీస్ కమీషనర్ అలోక్ సింగ్ సీఎన్‌ఎన్‌ న్యూస్ 18 తో మాట్లాడుతూ.. ప్రతిదీ ప్రణాళికల ప్రకారం జరిగిందని, బృందాలు అద్భుతంగా పనిచేశాయని చెప్పారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Business, National News, Noida, Noida Twin Towers, Supreme Court

ఉత్తమ కథలు