James Bond: జేమ్స్ బాండ్ 007 స్పెషల్ ఎడిషన్ కార్లు, బైక్​లు లాంచ్.. ధర చూస్తే షాకవ్వాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

James bond 007 edition bikes and cars: ట్రయంఫ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి టాప్​ ఆటోమొబైల్​ సంస్థలు జేమ్స్​ బాండ్​ 007తో భాగస్వామ్యం కదుర్చుకొని నాలుగు కొత్త వాహనాలను విడుదల చేశాయి. అయితే, ఈ జేమ్స్ బాండ్ ఎడిషన్ బైక్‌లు, కార్లు చాలా పరిమిత సంఖ్యలోనే విడుదలయ్యాయి. ఈ కార్లు, బైక్​లలో ఉన్న ప్రత్యేకతలపై ఓలుక్కేద్దాం.

  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్​ చిత్రాల అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న జేమ్స్​బాండ్ (James Bond)-‘నో టైమ్ టు డై (No time to die)’ చిత్రం విడుదలైంది. జేమ్స్​ బాండ్​ సిరీస్​లో 25వ సినిమా ఇదే కావడం విశేషం. తొలుత ఈ చిత్రాన్ని 2020 ఏప్రిల్​లోనే విడుదల చేయాలని భావించారు. అయితే, కరోనా మహమ్మారి (Corona Pandemic) కారణంగా వాయిడా పడుతూ వచ్చింది. మరోవైపు, జేమ్స్ బాండ్​గా నటిస్తున్న డేనియల్ క్రెయిగ్​ (Daniel Craig)కు ఇదే చివరి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలోని యాక్షన్​, ఛేజింగ్​ సన్నివేశాల కోసం ఉపయోగించిన కార్లు, బైక్​లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అచ్చం అవే కార్లు, బైక్​లపై రయ్​ మని దూసుకెళ్లాలని ప్రేక్షకులకు అనిపిస్తుంది. అటువంటి వారి కోసం ట్రయంఫ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి టాప్​ ఆటోమొబైల్​ సంస్థలు జేమ్స్​ బాండ్​ 007తో భాగస్వామ్యం కదుర్చుకొని నాలుగు కొత్త వాహనాలను విడుదల చేశాయి. అయితే, ఈ జేమ్స్ బాండ్ ఎడిషన్ బైక్‌లు, కార్లు చాలా పరిమిత సంఖ్యలోనే విడుదలయ్యాయి. వాటిలో చాలా వరకు ఇప్పటికే బుకింగ్స్​ కూడా క్లోజ్ అయ్యాయి. ఈ కార్లు, బైక్​లలో ఉన్న ప్రత్యేకతలపై ఓలుక్కేద్దాం.

ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 బాండ్ ఎడిషన్

బ్రిటీష్​ లగ్జీరీ మోటార్​ సైకిల్​ బ్రాండ్​ ట్రయంఫ్​స్క్రాంబ్లర్ 1200 బాండ్ ఎడిషన్​ పేరుతో కొత్త బైక్​ను రిలీజ్​ చేసింది. ఈ స్క్రాంబ్లర్ 1200 XE ఎడిషన్​పై ఎగ్జాస్ట్ నంబర్ బోర్డ్, సైడ్ ప్యానెల్స్‌లో '007' బ్రాండింగ్‌ను ప్రింట్​ చేసింది. అంతేకాదు, దీని ఇంధన ట్యాంక్‌పై భారీ ట్రయంఫ్ లోగో, కార్బన్-ఫైబర్ ఎండ్ క్యాప్‌లను డిజైన్​ను అందించింది. ఈ బైక్​ 1,200 సిసి ప్యార్లర్​ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 89 బిహెచ్‌పి, 110 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ జేమ్స్ బాండ్ ఎడిషన్ ట్రయంఫ్ బైక్ 18,500 డాలర్లు (రూ. 17.1 లక్షల) వద్ద అందుబాటులో ఉంటుంది. కేవలం 250 యూనిట్లు మాత్రమే విక్రయించనుంది.

పెట్రోల్ ధర చూసి భయపడుతున్నారా... Bajaj Chetak Electric Scooter మీ కోసం..

ల్యాండ్ రోవర్ డిఫెండర్ V8 బాండ్ ఎడిషన్

జేమ్స్​ బాండ్​ సినిమాలో లగ్జరీ కార్ల తయారీ సంస్థ ల్యాండ్​ రోవర్​కు చెందిన డిఫెండర్​ వీ8 బాండ్​ ఎడిషన్​ను కూడా ఉపయోగించారు. ఈ ప్రీమియం కారు బ్లాక్ కలర్‌ ఆప్షన్​లో మాత్రమే లభిస్తుంది. దీనిలో 22 -అంగుళాల లూనా గ్లోస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, జినాన్ బ్లూ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్​ను అందించారు. పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం '007' పుడల్ లాంప్ గ్రాఫిక్స్, 'డిఫెండర్ 007' ట్రెడ్‌ప్లేట్లు, '007' స్టార్ట్-అప్ యానిమేషన్ వంటివి చేర్చింది. దీనిలో 5.0 -లీటర్, సూపర్​చార్జ్డ్ V8 ఇంజిన్​ని చేర్చింది. ఇది 518 bhp, 625 Nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రత్యేక SUV ఎడిషన్ కార్లు కేవలం 300 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

విడుదలకు ముందే లీకైన మహీంద్రా XUV700 వేరియంట్ల ధరలు​.. ఏ వేరియెంట్‌కు ఎంత ధరంటే..

ట్రయంఫ్ టైగర్ 900 బాండ్ ఎడిషన్

జేమ్స్​ బాండ్​ సినిమా స్టంట్ సీన్లలో ఈ ట్రయంఫ్ టైగర్ 900 బాండ్ ఎడిషన్​ను ఉపయోగించారు. ట్రయంఫ్ టైగర్ 900 ర్యాలీ ప్రో ఆధారంగా ఈ బైక్​ను రూపొందించారు. ఈ స్పెషల్​ ఎడిషన్ బైక్​లు కేవలం 250 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనిలో మాట్ సఫైర్ బ్లాక్ పెయింట్ స్కీమ్, 007 బాడీ గ్రాఫిక్స్, ‘007’ టీఎఫ్​టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టార్ట్ అప్ యానిమేషన్, బాండ్ ఎడిషన్ బ్రాండింగ్‌ సీట్లు, ప్రత్యేక ఆఫ్-రోడ్ టైర్లు వంటివి అందించింది. ఈ జేమ్స్ బాండ్ ఎడిషన్​లో 888 cc ఇంజిన్​ను అమర్చింది. ఇది 87 Nm వద్ద 94 bhp టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.

TVS iQube: టీవీఎస్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్కసారి చార్జ్ చేస్తే 75 కిమీ

1964 ఆస్టన్ మార్టిన్ డీబీ5 గోల్డ్ ఫింగర్

బ్రిటీష్​ లగ్జరీ కార్​ బ్రాండ్​ ఆస్టన్ మార్టిన్ మొట్టమొదటి సారిగా జేమ్స్​ బాండ్​ ఎడిషన్​ను విడుదల చేసింది. సినిమాలో దీన్ని గోల్డ్ ఫింగర్‌ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్​గా ఉపయోగించారు. ఈ ప్రొడక్షన్ మోడల్‌లో స్మోక్ స్క్రీన్ డెలివరీ సిస్టమ్, సిమ్యులేటెడ్ ఆయిల్ స్లిక్ డెలివరీ సిస్టమ్, రివాల్వింగ్ ఫ్రంట్ అండ్ రియర్ నంబర్ ప్లేట్లు, బుల్లెట్ రెసిస్టెంట్ రియర్ షీల్డ్, రిమూవబుల్ ప్యాసింజర్ సీట్ రూఫ్ ప్యానెల్, సిమ్యులేటెడ్ ట్విన్ ఫ్రంట్ మెషిన్ గన్స్ వంటి ఆయుధాలను కూడా చేర్చింది. దీనిలో 290 bhp శక్తిని అందించే 4.0- లీటర్, ఇన్-లైన్ 6 -సిలిండర్ ఇంజిన్‌ను అందించింది. ఇది 2.75 మిలియన్​ డాలర్లు (రూ. 25.5 కోట్లు) వద్ద లభిస్తుంది. ఈ ఆస్టన్ మార్టిన్ క్లాసిక్ కారు కేవలం 25 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published: