హోమ్ /వార్తలు /బిజినెస్ /

Scrappage Policy: పదేళ్ల కంటే పాత ట్రాక్టర్లకు స్క్రాపేజ్ పాలసీ వర్తించదు.. కేంద్రం క్లారిటీ!

Scrappage Policy: పదేళ్ల కంటే పాత ట్రాక్టర్లకు స్క్రాపేజ్ పాలసీ వర్తించదు.. కేంద్రం క్లారిటీ!

Scrappage Policy: పదేళ్ల కంటే పాత ట్రాక్టర్లకు స్క్రాపేజ్ పాలసీ వర్తించదు.. కేంద్రం క్లారిటీ!

Scrappage Policy: పదేళ్ల కంటే పాత ట్రాక్టర్లకు స్క్రాపేజ్ పాలసీ వర్తించదు.. కేంద్రం క్లారిటీ!

Scrappage Policy : పదేళ్ల కంటే పాతవైన ట్రాక్టర్లకు అనుమతులు రద్దు చేస్తారనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఇది నిజం కాదని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

రోడ్లపై ఫిట్‌గాలేని వాహనాల కారణంగా చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. చాలా ఘటనల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రహదారి భద్రత కల్పించేందుకు, ఫిట్‌గా ఉండే వాహనాలే రోడ్లపై తిరిగేలా ప్రధాని నరేంద్ర మోదీ 2021 ఆగస్టులో వెహికల్‌ స్క్రాపేజ్ పాలసీని ప్రకటించారు. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడెర్నైజేషన్‌ ప్రోగ్రామ్‌ లేదా ట్రాన్స్‌పోర్ట్, నాన్-ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌ స్క్రాపింగ్ కోసం వెహికల్‌ స్క్రాపింగ్ పాలసీ (Scrappage Policy)ని రూపొందించింది.

అయితే ఈ అంశంలో వివిధ వాహనాలకు సంబంధించిన నిబంధనలపై పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా పదేళ్ల కంటే పాతవైన ట్రాక్టర్లకు అనుమతులు రద్దు చేస్తారనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఇది నిజం కాదని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.

‘10 సంవత్సరాల తర్వాత ట్రాక్టర్లను తప్పనిసరిగా స్క్రాప్ చేయాలని, వాటిని తొలగించాలని ట్విట్టర్ , వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారంలలో వైరల్ అవుతున్న వార్తలు నిజంకాదు. అవి నిరాధారమైనవి.’ అని సంబంధిత మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. భయాందోళనలు సృష్టించడానికి ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

* ఆందోళన అనవసరం

స్క్రాపేజ్ పాలసీ కింద వాహనాలను తుక్కుగా మార్చడానికి నిర్దేశించిన తప్పనిసరి వయోపరిమితి లేదు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా పరీక్షించిన తర్వాత వాహనం ఫిట్‌గా ఉన్నంత వరకు రోడ్డుపై నడపవచ్చు. 15 సంవత్సరాల తర్వాత కార్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించాలని నిర్ణయించారు. ట్రాక్టర్లు లేదా నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాల విషయంలో ఇలాంటి ఆందోళన అవసరం లేదు.

అగ్రికల్చర్‌ ట్రాక్టర్ నాన్-ట్రాన్స్‌పోర్ట్ వెహికల్. ట్రాక్టర్‌ను కొనుగోలు చేసిన సమయంలో 15 సంవత్సరాలకు రిజిస్టర్‌ చేస్తారు. ప్రారంభ రిజిస్ట్రేషన్ పీరియడ్‌ 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, దీని రిజిస్ట్రేషన్‌ను ఒకేసారి ఐదు సంవత్సరాల పాటు రెన్యువల్‌ చేసుకోవచ్చు. వాస్తవానికి 2023 జనవరి 16న విడుదలైన G.S.R.29(E) నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిర్దిష్ట ప్రభుత్వ వాహనాలకు మినహా మరే వాహనానికి భారత ప్రభుత్వం ఈ స్క్రాపింగ్ ఏజ్‌ను నిర్ణయించలేదు.

* ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు

కార్లకు సంబంధించిన స్క్రాపేజ్ పాలసీని కేంద్ర ప్రభుత్వం జారీ చేసినప్పటికీ, ఇది యజమానులకు అందించే ప్రయోజనాలపై స్పష్టత లేదు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సొంత వెర్షన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్ల నాటి వాహనాలను స్క్రాపింగ్ చేస్తే పన్నులు, జరిమానాల్లో 50 శాతం, 20 ఏళ్లు పాత వాహనాలపై 75 శాతం రాయితీ ఇస్తోంది. ఇలా కొన్ని రాష్ట్రాలు స్క్రాపేజ్‌ విధానాన్ని ప్రోత్సహించేందుకు వివిధ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి.

First published:

Tags: Auto, Central Government, Tractors, Vehicles

ఉత్తమ కథలు