దక్కని ఊరట..మరింత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్‌లో పెట్రోల్ 16 పైసలు పెరిగి లీటరు రూ.89.06కి చేరగా...డీజిల్ 22 పైసలు పెరిగి రూ.82.07కి చేరింది.

news18-telugu
Updated: October 4, 2018, 12:09 PM IST
దక్కని ఊరట..మరింత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రతీకాత్మక చిత్రం..
  • Share this:
పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గురువారం లీటరు పెట్రోల్‌పై మరో 14 పైసలు పెరిగింది. దీంతో ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.91.34కి చేరుకుంది. అటు డీజిల్ కూడా 21 పైసలు పెరిగి...లీటరు రూ.80.10కు చేరుకుంది. దిల్లీలో లీటరు పెట్రోల్ 15 పైసలు పెరిగి రూ.84కు చేరుకోగా...డీజిల్ 20 పైసలు పెరిగి రూ.74.75కి చేరింది.

హైదరాబాద్‌లో పెట్రోల్ 16 పైసలు పెరిగి లీటరు రూ.89.06కి చేరగా...డీజిల్ 22 పైసలు పెరిగి రూ.82.07కి చేరింది.


చెన్నైలో పెట్రోల్ 15 పైసలు పెరిగి లీటరు రూ.87.33కు చేరగా...డీజిల్ 22 పైసలు పెరిగి 79.79కు చేరింది. కోల్‌కత్తాలో 15 పైసలు పెరిగి లీటరు పెట్రోల్ రూ.85.80కి చేరగా...డీజిల్20 పైసలు పెరిగి రూ.77.30కి చేరినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆగస్టు మాసం రెండో వారం నుంచే దేశంలో ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిత్యం రికార్డు గరిష్ట స్థయిని నమోదు చేసుకుంటూ ఇంధన ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి.ఇవి కూడా చదవండి..

  • Pics: పెట్రోల్ ధరలు ఏ దేశంలో తక్కువ? ఎక్కడ ఎక్కువ?
  • Loading...

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.19.48, లీటరు డీజిల్‌పై రూ.15.33ల ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేస్తోంది. దీనికి అదనంగా పలు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ బాదితున్నాయి. ముంబైలో అత్యధికంగా పెట్రోల్‌పై 39.12 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా...తెలంగాణ రాష్ట్రంలో డీజిల్‌పై అత్యధికంగా 26 శాతం వ్యాట్ బాదుతున్నారు.


ఇది కూడా చదవండి..
First published: October 4, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...