Home /News /business /

NO RELIEF FOR MIDDLE CLASS AS INCOME TAX SLABS REMAIN UNCHANGED FM PROPOSES ABOLISH NEED FILE IT RETURNS SENIOR CITIZENS MK

Budget 2021: వేతన జీవులకు నిరాశ...టాక్స్ శ్లాబుల్లో మార్పుల్లేవ్...సీనియర్ సిటిజన్స్ కు ఊరట..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

75 ఏళ్లు దాటిన వారు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరమే లేదని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

    ఈసారి బడ్జెట్ లో ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో 2021-22 బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశను మిగిలింది. కానీ 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్‌కు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. 75 ఏళ్లు దాటిన వారు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని  నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే ఎన్‌ఆర్‌ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుంచి మినహాయింపు ఇస్తున్నామని, చిన్న పన్ను చెల్లింపుదారులకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జీఎస్టీ సరళీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని, స్టార్టప్‌లకు పన్ను మినహాయింపును ఏడాది వరకు పొడగిస్తున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. గృహ రుణాలపై వడ్డీ రాయితీని మరో ఏడాది పాటు పొడగిస్తామని ప్రకటించారు. పన్ను ఎగవేతదారులను పట్టుకోడానికి కొత్త వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు.

    అలాగే పన్ను రిటర్నులను రీఓపెన్ చేసే సమయం 6 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదింపు విధించారు. అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనాలు వర్తింపు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ట్యాక్స్‌ ఆడిట్‌ పరిమితి రూ.10 కోట్లకు పెంపు. 400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు చేపట్టారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Budget 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు