• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • NO PLANS TO ENTER CONTRACT FARMING AND WILL NOT PURCHASE ANY AGRICULTURAL LAND SAYS RELIANCE INDUSTRIES NK

కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసేది లేదు.. ఏ వ్యవసాయ భూమినీ కొనము.. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం

కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసేది లేదు.. ఏ వ్యవసాయ భూమినీ కొనము.. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం

కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసేది లేదు.. ఏ వ్యవసాయ భూమినీ కొనము.. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం (ప్రతీకాత్మక చిత్రం)

Reliance Industries Limited (RIL): పంజాబ్, హర్యానాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహ సంస్థ... రిలయన్స్ జియోకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండటంతో.. ఈ అంశంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టమైన ప్రకటన చేసింది.

  • Share this:
    Reliance Industries Limited (RIL): పంజాబ్, హర్యానాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ సహ సంస్థ రిలయన్స్ జియోకి వ్యతిరేకంగా ఆందోళనలు, దాడులు జరుగుతుండటంతో... కొన్ని అంశాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) స్పష్టమైన ప్రకటన చేసింది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ లేదా కార్పొరేట్ ఫార్మింగ్ వంటి ప్లాన్స్ ఏవీ తమకు లేవని తెలిపింది. రైతుల సాధికారతే తమకు ముఖ్యమన్న రిలయన్స్ ఇండస్ట్రీస్... తమకు ఇలాంటి వాటిలోకి వెళ్లే ఉద్దేశం లేదని తెలిపింది. ఇదే అంశంపై మరింత స్పష్టత ఇచ్చిన సంస్థ... తాము కార్పొరేట్ ఫార్మింగ్ (కార్పొరేట్ వ్యవసాయం) కోసం ఎప్పుడూ వ్యవసాయ భూమిని కొనలేదనీ, అలాగే కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం కూడా కొనలేదనీ, అలాంటి ప్లాన్స్ లేవని చెప్పింది. అంతేకాదు... తాము ఎప్పుడూ ఆహార ధాన్యాలను రైతులు, వారి సప్లయర్ల నుంచి డైరెక్టుగా కొనట్లేదనీ... ఏది కొన్నా కనీస మద్దతు ధర (MSP)కే కొంటున్నట్లు తెలిపింది. తక్కువ ధరలకు ఎలాంటి దీర్ఘ కాలిక ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టులూ తాము కుదుర్చుకోలేదని తెలిపింది.

    పంజాబ్‌లో రిలయన్స్ జియో కమ్యూనికేషన్ టవర్లపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ... తాము ఓ రిట్ పిటిషన్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టులో వేసినట్లు రిలయన్స్ తెలిపంది. సంస్థ ఉద్యోగులు, సంస్థ ఆస్తులకూ నష్టం జరగకుండా ఉండేలా వెంటనే ఓ సరైన ఆదేశం ఇవ్వాల్సిందిగా హైకోర్టును పిటిషన్‌లో కోరింది. ఈ దాడుల వెనక కొన్ని ప్రత్యేక శక్తులు, వ్యాపార శత్రువులు ఉన్నట్లు రిలయన్స్ ఆరోపించింది.

    పంజాబ్‌లో ఈమధ్య కొన్ని వారాలుగా రిలయన్స్ యాజమాన్యం కిందకు వచ్చే జియో టెలికం గేర్‌కి సంబంధించిన దాదాపు 1500 టవర్లపై దాడులు జరిగాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ... ఆందోళనలు చేస్తున్న రైతులే నాశనం చేశారనే ప్రచారం జరిగింది. నవంబర్‌లో కొంతమంది రైతుల బృందాలు పంజాబ్‌లోని రిలయన్స్ ఫ్రెష్ స్టోర్లను బలవంతంగా మూసివేయించారు. ఈ కొత్త చట్టాలు కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉంటాయని జరుగుతున్న ప్రచారంతో రైతులు ఇలాంటి ఆందోళనలకు దిగినట్లు తెలిసింది.

    Reliance Industries, Reliance Industries Limited, mukhesh ambani, reliance jio, business news, reliance industries deals, రిలయన్స్ ఇండస్ట్రీస్, ముఖేష్ అంబానీ, రిలయన్స్ జియో, రైతుల ఆందోళనలు,
    రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటన


    పంజాబ్, హర్యానా సహా కొన్ని రాష్ట్రాలకు చెందిన వేల మంది రైతులు... ఢిల్లీ సరిహద్దుల్లో కంటిన్యూగా ఆందోళనలు చేస్తున్నారు. నవంబర్ 26న ఈ ధర్నాలు ప్రారంభమయ్యాయి. కేంద్రం తెచ్చిన చట్టాలను పూర్తిగా రద్దు చెయ్యాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే... కనీస మద్దతు ధరను తిరిగి కల్పిస్తూ... దీనిపై గ్యారెంటీ ఇవ్వాలని కోరుతున్నాయి.

    ఈ అంశంపై కేంద్రం, రైతు సంఘాల మధ్య ఇప్పటికే ఆరుసార్లు చర్చలు జరిగాయి. ఆందోళన చేస్తున్న రైతులు... కొత్త చట్టాల వల్ల తమకు మద్దతు ధర లభించదనీ, తమ భూములను కాంట్రాక్ట్ లేదా కార్పొరేట్ ఫార్మింగ్ పేరుతో... కార్పొరేట్ వర్గాలు లాగేసుకుంటాయనే అభిప్రాయంతో ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ చట్టాల వల్ల రైతులకే మేలు జరుగుతుందని చెబుతోంది.

    జనవరి 4న అంటే నేడు మరోసారి కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరగనున్నాయి. వీటిని చివరి రౌండ్ చర్చలుగా రైతులు భావిస్తున్నారు. ఇవాళ్టి చర్చల్లో ఎలక్ట్రిసిటీ యాక్ట్, పర్యావరణం వంటి అంశాల్లో ఉన్న సందిగ్ధతలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఐతే... కేంద్రం నుంచి కనీస మద్దతు ధరకు గ్యారెంటీ, మూడు చట్టాలనూ రద్దు చేసే అంశంపై ఇంకా ఎలాంటి గ్యారెంటీ రాలేదు.

    Disclosure: Reliance Industries Ltd. is the sole beneficiary of Independent Media Trust which controls Network18 Media & Investments Ltd which publishes teluguNews18.
    Published by:Krishna Kumar N
    First published: