• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • NO PENALTY ON JEWELLERS FOR NON COMPLIANCE OF MANDATORY GOLD HALLMARKING TILL AUGUST SAYS GOVT SU GH

Gold Hallmarking: జ్యూవెలరీ షాపు యాజమాన్యాలకు ఊరట.. ఆ నిబంధన పాటించకపోయినప్పటికీ ఆగస్టు వరకు నో పెనాల్టీ

ప్రతీకాత్మక చిత్రం

జ్యూవెలరీ షాపు యాజమాన్యాలకు కాస్త ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జూన్ 15 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చినప్పటికీ.. ఆగస్టు వరకు దీన్ని అమలు చేయనప్పటికీ ఎటువంటి జరిమానా విధించమని తెలిపింది.

  • Share this:
కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా బంగారం హాల్ మార్క్​ను తప్పనిసరి చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిబంధన జూన్​ 15 నుంచి అమల్లోకి వచ్చింది. గతంలో ఈ గడువు జూన్​ 1 వరకు ఉండగా.. తర్వాత దాన్ని జూన్​ 15 వరకు పొడగించారు. ఈ నిబంధన అమల్లోకి వచ్చినందున ఇకపై హాల్​ మార్క్​ లేకుండా బంగారు ఆభరణాలు విక్రయించరాదు. ఒకవేళ, విక్రయిస్తే జ్యూవెలరీ షాపులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటారు. బ్యూరో ఆఫ్​ ఇండియన్​ స్టాండర్డ్స్ (బిఐఎస్​) ప్రకారం అన్ని జ్యూవలరీ షాపు యాజమాన్యాలు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సిందే. అయితే, జ్యూవెలరీ షాపు యాజమాన్యాలకు కాస్త ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జూన్ 15 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చినప్పటికీ.. ఆగస్టు వరకు దీన్ని అమలు చేయనప్పటికీ ఎటువంటి జరిమానా విధించమని తెలిపింది.

హాల్​మార్క్​ లేని బంగారు ఆభరణాలను ఎవరైనా విక్రయిస్తే కస్టమర్లు నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. దీని కోసం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ BISCARE యాప్​, కన్జ్యూమర్​ ఎంగేజ్‌మెంట్ పోర్టల్‌ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా కస్టమర్లు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని తెలిపింది.

హాల్​మార్కింగ్​ అంటే?
హాల్​ మార్కింగ్​ అనేది బంగారం వంటి లోహాల స్వచ్ఛతను ధ్రువీకరిస్తుంది. దీన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) పర్యవేక్షిస్తుంది. ఆభరణాలపై హాల్​మార్క్​ ప్రింట్​ అయి ఉంటే అవి స్వచ్ఛత గల ఆభరణాలుగా ప్రభుత్వం సర్టిఫై చేసినట్లు అర్ధం చేసుకోవాలి. నకిలీ బంగారు ఆభరణాలను గుర్తించేందుకు, కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. తద్వరా, కస్టమర్లు స్వచ్ఛమైన బంగారు ఆభారణాలను సులభంగా గుర్తించి కొనుగోలు చేయవచ్చు. కాగా, ఈ హాల్ ​మార్కింగ్​ విధానాన్ని 2021 నవంబర్​ 20 నుంచి తప్పనిసరిగా అమలు చేస్తామని 2019 నవంబర్​లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కరోనా వైరస్​ మహమ్మారి కారణంగా రెండు సార్లు గడువు పొడగించింది. ఎట్టకేలకు జూన్​ 15న దీన్ని అమల్లోకి తెచ్చింది.

దీనిపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ మాట్లాడుతూ ‘‘వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు హాల్​ మార్కింగ్​ విధానాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించాం. అయితే, చిన్న వ్యాపారులతో పాటు లక్షలాది జ్యూవెలరీ యాజమాన్యాలు ఈ కొత్త విధానంలోకి మారాల్సి ఉంటుంది. ఈ కొత్త వ్యవస్థకు అలవాటు పడటానికి వారికి కొంత సమయం పడుతుంది. అందువల్లే, ఆగస్టు వరకు హాల్​మార్కింగ్​ లేని ఆభరణాలు అమ్మినా జరిమానా విధించకూడదని నిర్ణయించాం. అయితే, బంగారం షాపులు హాల్​మార్కింగ్​ లేని ఆభరాణాలు విక్రయిస్తే కస్టమర్లు ఫిర్యాదు చేయవచ్చు. వారిపై మూడు నెలల తరువాత జరిమానా విధిస్తాం” అని చెప్పారు.

తాజా నియమం అమల్లోకి వచ్చినందున ఇకపై బంగారం షాపులు 14, 18,22 క్యారెట్ల బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఉంటుంది. 20, 23, 24 క్యారెట్ల బంగారు ఆభరణాల విషయంలో హాల్‌మార్కింగ్ దశలవారీగా అమలు చేస్తారు. వీటి కోసం బిఐఎస్ నాణ్యతా ప్రమాణాలను రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
Published by:Sumanth Kanukula
First published: