హోమ్ /వార్తలు /బిజినెస్ /

Toll Fees: టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు... ఏఏ సందర్భాల్లో అంటే

Toll Fees: టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు... ఏఏ సందర్భాల్లో అంటే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Toll Fees | మీకు ఫోర్ వీలర్ ఉందా? జాతీయ రహదారుల్లో టోల్ ప్లాజాల మీదుగా వెళ్తుంటారా? కొన్ని సందర్భాల్లో టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎప్పుడెప్పుడో తెలుసుకోండి.

  నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI కొత్త గైడ్‌లైన్స్ ప్రకటించింది. టోల్ ప్లాజాల దగ్గర కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం వాహనదారులు కొన్ని సందర్భాల్లో అసలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరమే లేదు. భారతదేశంలో 100 శాతం టోల్ ప్లాజాలు క్యాష్‌లెస్‌గా మారిపోయాయి. అంటే వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏ టోల్ ప్లాజాలో కూడా నగదు తీసుకోవట్లేదు. ఏదైనా వాహనం టోల్ ప్లాజా దాటాలంటే ఖచ్చితంగా ఫాస్ట్‌ట్యాగ్ ఉండాల్సిందే. ఒకవేళ ఫాస్ట్‌ట్యాగ్ లేకపోతే అక్కడే ఫాస్ట్‌ట్యాగ్ తీసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల్లో ఫాస్ట్‌ట్యాగ్ లేన్లు ఉండటంతో ఇక వాహనాలు ఎక్కువసేపు క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా లేదు. వాహనం టోల్ ప్లాజా దగ్గరకు చేరుకోగానే ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా పేమెంట్ కొన్ని సెకండ్లలో జరిగిపోతుంది. కాబట్టి వాహనాలు నిలపాల్సిన అవసరం లేకుండా వెళ్లిపోతుంటాయి.

  SBI Account KYC: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? మే 31 లోగా ఈ డీటెయిల్స్ బ్యాంకుకి ఇవ్వండి

  EPF Account: రెండు పీఎఫ్ అకౌంట్స్ ఉన్నాయా? అయితే ఈ విషయం తెలుసుకోండి

  NHAI కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం టోల్ ప్లాజా దగ్గర వాహనం 10 సెకండ్ల కన్నా ఎక్కువ నిలపాల్సిన పరిస్థితి రాదు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా వాహనం 10 సెకండ్లలోపే టోల్ ప్లాజా దాటుతుంది. 100 మీటర్ల కన్నా ఎక్కువ క్యూ ఉండదని NHAI తెలిపింది. ఏవైనా కారణాల వల్ల టోల్ ప్లాజాల దగ్గర 100 మీటర్ల కన్నా ఎక్కువ క్యూ ఉన్నట్టైతే వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండా ముందుకు వెళ్లిపోవచ్చు. టోల్ ప్లాజా నుంచి 100 మీటర్ల దూరంలో ఎల్లో లైన్ ఉంటుంది. ఆ ఎల్లో లైన్ దాటి వాహనాలు క్యూలో ఉంటే టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు... టోల్ ప్లాజాల దగ్గర ఏవైనా సాంకేతిక సమస్యలు ఉన్నా వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లిపోవచ్చని గతంలోనే క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

  ATM Transaction Failed: ఏటీఎంలో డబ్బులు రాలేదా? అకౌంట్‌లో బ్యాలెన్స్ కట్ అయితే ఇలా కంప్లైంట్ చేయండి

  SBI Scheme: ఎస్‌బీఐ ఈ స్కీమ్‌లో చేరడానికి జూన్ 30 చివరి తేదీ

  టోల్ ప్లాజా దాటే ప్రతీ ఫోర్ వీలర్‌కు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ తీసుకునేందుకు అవకాశం ఇస్తూ పలుమార్లు గడువు కూడా పొడిగించింది. ఇప్పుడు టోల్ ప్లాజాల దగ్గర నగదు చెల్లింపులు లేవు. వాహనదారులు తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవాల్సిందే. టోల్ ప్లాజాల దగ్గరే ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవచ్చు. లేదా బ్యాంకులు, ఆర్‌టీఓలు, కామన్ సర్వీస్ సెంటర్లు, ట్రాన్స్‌పోర్ట్ హబ్స్, బ్యాంక్ బ్రాంచ్‌లు, ఎంపిక చేసిన పెట్రోల్ బంకులు, వ్యాలెట్ సర్వీసులు అందించే సంస్థల నుంచి ఫాస్ట్‌ట్యాగ్ కొనొచ్చు. ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో My FASTag App ద్వారా తెలుసుకోవచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: FASTag, Four wheeler, Toll plaza

  ఉత్తమ కథలు