Reserve Bank of India | దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. ఖాతాదారులు బ్యాంక్ అకౌంట్ వివరాలను (KYC) అప్డేట్ చేసుకోవడం కోసం బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేదని వెల్లడించింది. కస్టమర్లు ఆన్లైన్లోనే రికేవైసీ పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. అయితే అడ్రస్ మారితే మాత్రం బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఆర్బీఐ కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనల ప్రకారం చూస్తే.. బ్యాంకులు కాల క్రమేణా క్రమం తప్పకుండా కస్టమర్ల వివరాలను అప్డేట్ చేసుకుంటూ ఉంటాయి. కస్టమర్లు కూడా బ్యాంక్ అధికారులకు ఆ వివరాలను అందించాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సమయంలో ఏ వివరాలను అయితే అందించారో ప్రతిసారి అవే వివరాలు అందించాలి. అడ్రస్ వంటివి మారితే అప్పుడు కొత్త వివరాలతో రికేవైసీ చేసుకోవచ్చు.
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు భారీ షాక్.. బ్యాంక్ కీలక నిర్ణయం!
బ్యాంకులు వాటి కస్టమర్ల రీకేవైసీని ఆన్లైన్లో కూడా పూర్తి చేయొచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు రావాల్సిందిగా కస్టమర్లను కోరాల్సిన పని లేదు. ఒకవేళ బ్యాంకులు కస్టమర్లను ఒత్తిడి చేస్తే మాత్రం.. ఫిర్యాదు చేయొచ్చు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చని ఆర్బీఐ తెలిపింది.
కస్టమర్లకు కొత్త ఏడాది కానుక.. బ్యాంక్ అదిరిపోయే ప్రకటన!
కాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందరి అంచనాలకు అనుగుణంగానే రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ రెపో రేటు పెంపు ఈ ఏడాది ఇది ఐదో సారి కావడం గమనార్హం. రెపో రేటు ఈరోజు 35 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. దీంతో కీలక రెపో రేటు 6.25 శాతానికి చేరింది.
ఆర్బీఐ రెపో రేటు ప్రాతిపదికన బ్యాంకులు స్వల్ప కాలానికి గానూ రుణాలు అందిస్తూ ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని అడ్డుకునుందకు ఆర్బీఐ రెపో రేటును పెంచుకుంటూ వెళ్తోంది. ఈ ఏడాది రెపో రేటు ఐదు సార్లు పెరిగింది. మే నుంచి రెపో రేటు పెరుగుతూనే వస్తోంది. కేవలం ఆర్బీఐ మాత్రమే కాకుండా ప్రపంచ కేంద్ర బ్యాంకులు కూడా కీలక పాలసీ రేట్లను పెంచుకుంటూనే వెళ్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు కూడా ఇదే దారిలో పయనిస్తోంది. ఫెడ్ రేటును పెంచుకుంటూ వెళ్తోంది. ఆర్బీఐ రెపో రేటు పెంపు వల్ల రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడనుంది. అలాగే బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Banks, KYC submissionsn, Rbi, Reserve Bank of India