హోమ్ /వార్తలు /బిజినెస్ /

Elon Musk: ట్విస్ట్ ఇచ్చిన ఎలాన్‌ మస్క్‌.. ఇక ఆ టెన్షన్ ఉండదా?

Elon Musk: ట్విస్ట్ ఇచ్చిన ఎలాన్‌ మస్క్‌.. ఇక ఆ టెన్షన్ ఉండదా?

Elon Musk: ట్విస్ట్ ఇచ్చిన ఎలాన్‌ మస్క్‌.. ఇక ఆ టెన్షన్ ఉండదా?

Elon Musk: ట్విస్ట్ ఇచ్చిన ఎలాన్‌ మస్క్‌.. ఇక ఆ టెన్షన్ ఉండదా?

ఇప్పటి నుంచి ట్విట్టర్‌లో లేఆఫ్స్ ఉండబోవని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. త్వరలో మళ్లీ నియామకాలు ఉంటాయని వెల్లడించారు. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తన నిర్ణయాలతో ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటున్నారు. ట్విట్టర్‌ను (Twitter) కొనుగోలు చేసిన తర్వాత, సీఈఓగా మస్క్, కంపెనీలో పెద్ద మార్పులను చేస్తూ వస్తున్నారు. ఆ సంస్థలో మొన్నటి వరకు లేఆఫ్స్ పరంపర కొనసాగింది. దీంతో ట్విట్టర్ ఉద్యోగుల (Employees) నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన చేసిన ఒక ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఇప్పటి నుంచి ట్విట్టర్‌లో లేఆఫ్స్ ఉండబోవని మస్క్ స్పష్టం చేశారు. త్వరలో మళ్లీ నియామకాలు ఉంటాయని వెల్లడించారు. దీంతో ఉద్యోగుల్లో లేఆఫ్స్ టెన్షన్ ఉండదని చెప్పుకోవచ్చు.

మస్క్‌ ట్విట్టర్‌(Twitter)ను టేకోవర్ చేసిన మూడు వారాల్లోనే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాంలో ఈ మధ్య కాలంలో 7,500 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించారు. సంస్థ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మందిని తీసివేయడంతో అంతా షాక్‌కి గురయ్యారు. తాజాగా ఈ విషయంపై మస్క్‌ మరోసారి తన నిర్ణయాన్ని వెల్లడించారు. తొలగింపులు ముగిశాయని, మళ్లీ నియాకాలు చేస్తున్నట్లు మస్క్‌ తెలిపారు. ఉద్యోగులతో జరిగిన ఒక సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. ఇంజినీరింగ్, సేల్స్‌ విభాగాల్లో పెద్ద ఎత్తున మళ్లీ నియామకాలు ఉండబోతున్నాయని తెలిపారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారికి శుభవార్త!

సాఫ్ట్‌వేర్లు రాయడంలో గొప్పగా పని చేసేవారి కోసం తాము చూస్తున్నామని, అది తమ హైయస్ట్‌ ప్రయారిటీలలో ఒకటని ఎలాన్‌ మస్క్ తెలిపారు. ఉన్న పోస్టుల్లో సరిపోయే పొటన్షియల్‌ క్యాండేట్లు ఎవరైనా ఉంటే వారిని రికమెండ్‌ చేయాలని ఆయన ఉద్యోగులను కోరారు. ఈ విషయంపై అమెరికన్‌ మీడియాలోనూ వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ నియామకాలపై సంస్థ ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్‌ చేయలేదు. ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాంకు సంబంధించిన వెబ్‌సైట్‌లోనూ ఓపెనింగ్‌ పొజిషన్‌ల వివరాలేవీ పొందపరచలేదు.

6 నెలల్లోనే డబ్బు రెట్టింపు.. ఈ 5 బ్యాంకులతో భారీ లాభాలు!

ప్రస్తుతం ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. అయితే టెస్లా మాదిరిగా దాన్ని టెక్సాస్‌కు మార్చడానికి ఇప్పటి వరకు తమకు ఎలాంటి ప్రణాళికలు లేవని ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. అయినప్పటికీ టెక్సాస్, కాలిఫోర్నియాలో ద్వంద్వ ప్రధాన కార్యాలయాలు ఉండే అవకాశం లేకపోలేదు. మేము ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు తరలించాలనుకుంటే అది లెఫ్ట్ వింగ్ నుండి రైట్‌వింగ్‌కు మారినట్లు తాను భావిస్తానని మస్క్ ఉద్యోగులతో చమత్కరించారు.

భారీ లేఆఫ్‌లలో భాగంగా భారత్‌లోని ట్విట్టర్‌ ఉద్యోగుల్లో 90శాతం మంది కంపెనీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత కంపెనీ నుంచి ఉద్యోగులు పెద్ద ఎత్తున రాజీనామాలు కూడా చేశారు. ఇలా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్విట్టర్‌ కార్యాలయాల్లో 1000 మంది కంపెనీ నుంచి బయటకు వెళ్లారు. దీంతో రిప్‌ ట్విట్టర్‌ హ్యాష్ ట్యాగ్‌ని వైరల్‌ చేసి లేఆఫ్స్‌పై తమ నిరసన తెలిపారు. ఈ నిరసనల మధ్య ఇప్పుడు ఎలాన్‌ మస్క్‌ ప్రకటన అంతటా చర్చనీయాంశంగా మారింది.

First published:

Tags: Elon Musk, Layoffs, Twitter

ఉత్తమ కథలు