• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • NO MORE CASHBACKS PAYTM MALL SLASHED CASHBACKS IN VARIOUS CATEGORIES SS

No Cashback: పేటీఎం మాల్‌లో ఇక క్యాష్‌బ్యాక్ ఉండదా?

No Cashback: పేటీఎం మాల్‌లో ఇక క్యాష్‌బ్యాక్ ఉండదా?

Shock: పేటీఎం మాల్‌లో ఇక క్యాష్‌బ్యాక్ ఉండదా?

No more cashbacks | పేటీఎం మాల్‌లో క్యాష్‌బ్యాక్స్ నిలిపివేస్తున్నారన్న వార్త యూజర్లకు బ్యాడ్ న్యూస్‌గా మారింది. క్యాష్‌బ్యాక్స్ వల్ల నష్టాలు పెరిగిపోతున్నాయి పేటీఎం భావిస్తోంది.

  • Share this:
    క్యాష్‌బ్యాక్... ఈ మాట వింటే మొదట గుర్తొచ్చే వ్యాలెట్ పేటీఎం. యూజర్లకు ఇచ్చిన క్యాష్‌బ్యాక్స్‌తోనే పేటీఎం చాలా పాపులర్ అయింది. పేటీఎంకు అనుబంధంగా ప్రారంభించిన షాపింగ్ ప్లాట్‌ఫామ్ పేటీఎం మాల్‌లో కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు చాలానే ఉండేవి. వందల కోట్ల క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో పేటీఎం మాల్‌లో సేల్స్ ఉండేవి. గతేడాది ఫెస్టివల్ సీజన్‌లో అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్‌కు పోటీగా రూ.501 కోట్ల రూపాయల క్యాష్‌బ్యాక్ సేల్ ప్రకటించింది పేటీఎం మాల్. కానీ ఇప్పుడు పేటీఎం మాల్‌లో క్యాష్‌బ్యాక్స్ నిలిపివేస్తున్నారన్న వార్త యూజర్లకు బ్యాడ్ న్యూస్‌గా మారింది. క్యాష్‌బ్యాక్స్ వల్ల నష్టాలు పెరిగిపోతున్నాయి పేటీఎం భావిస్తోంది. అందుకే ఇక ఈ క్యాష్‌బ్యాక్ మోడల్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయం పేటీఎంలో అమ్మకాలపై ప్రభావం చూపిస్తుందని మార్కెట్ నిపుణుల అంచనా.

    Read this:

    Ombudsman Scheme: డిజిటల్ లావాదేవీలో మోసపోయారా? ఇలా కంప్లైంట్ చేయొచ్చు

    ఇప్పటికే గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ విభాగాల్లో పేటీఎం మాల్ క్యాష్‌బ్యాక్స్‌ని తొలగించినట్టు ఎకనమిక్స్ టైమ్స్ కథనం. క్యాష్‌బ్యాక్స్ తొలగించడం వల్ల గ్రాసరీ విభాగంలోనే 90% అమ్మకాలు తగ్గిపోయాయట. వాస్తవానికి ఈ విభాగంలో గరిష్టంగా 35 శాతం క్యాష్‌బ్యాక్ ఉండేది. మెల్లిమెల్లిగా క్యాష్‌బ్యాక్ తగ్గిస్తూ రావడం వల్ల అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఇ-కామర్స్ దిగ్గజాలకు పేటీఎం మాల్ గట్టి పోటీ ఇచ్చిందంటే అందుకు కారణం క్యాష్ బ్యాక్ మోడలే. పేటీఎంలో ఏం కొన్నా క్యాష్‌బ్యాక్ వస్తుందన్న నమ్మకం యూజర్లలో ఉండేది. అందుకే షిప్పింగ్ ఛార్జీలు ఉన్నా యూజర్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ... ఇప్పుడు అలాంటి ఆఫర్లు లేకపోవడం పేటీఎం మాల్ అమ్మకాలను ఖచ్చితంగా దెబ్బతీస్తుంది.

    Read this: వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ వచ్చేసింది

    O2O- ఆన్‌లైన్‌ టు ఆఫ్‌లైన్‌పై దృష్టిపెట్టేందుకే క్యాష్‌బ్యాక్స్ తగ్గించామని పేటీఎం మాల్ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. అంటే ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా ఆఫ్‌లైన్ స్టోర్లకు వ్యాపారం పెంచడం అన్నమాట. దీని ద్వారా లాజిస్టిక్ ఖర్చులు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు.

    ఇవి కూడా చదవండి:

    I love you, Thank you... గూగుల్ ఎక్కువగా ట్రాన్స్‌లేట్ చేసినవి ఇవే

    టెన్త్ మాత్రమే చదివాడు... ఆల్కహాల్ డిటెక్టర్ కనిపెట్టాడు... కేటీఆర్‌ని మెప్పించాడు
    First published:

    అగ్ర కథనాలు