NO MINIMUM BALANCE REQUIRED FOR BASIC SAVINGS BANK DEPOSIT ACCOUNT IN STATE BANK OF INDIA KNOW ALL DETAILS ABOUT BSBD ACCOUNT SS
SBI BSBD Account: మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా ఎస్బీఐలో అకౌంట్
SBI BSBD Account: మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా ఎస్బీఐలో అకౌంట్
State Bank of India-Basic Savings Bank Deposit Account | కేవైసీ సరిగ్గా ఉన్నవారు దేశంలోని అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో BSBD తీసుకోవచ్చు. పేదల కోసం రూపొందించిన అకౌంట్ ఇది. ఈ అకౌంట్‌కు డెబిట్ కార్డ్, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి సదుపాయాలన్నీ ఉంటాయి.
బ్యాంకులో అకౌంట్ మెయింటైన్ చేయాలంటే అందులో కనీస బ్యాలెన్స్ తప్పనిసరి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ తీసుకున్న ప్రాంతాన్ని, అకౌంట్‌ను బట్టి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మారుతుంది. బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవాళ్లు బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేక జరిమానాలు చెల్లిస్తూ ఉంటారు. అయితే ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ లేని అకౌంట్‌ను ఆఫర్ చేస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(BSBD) అకౌంట్. దీన్నే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని పిలుస్తారు. కేవైసీ సరిగ్గా ఉన్నవారు దేశంలోని అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో BSBD తీసుకోవచ్చు. పేదల కోసం రూపొందించిన అకౌంట్ ఇది. ఈ అకౌంట్‌కు డెబిట్ కార్డ్, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి సదుపాయాలన్నీ ఉంటాయి. ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఎస్బీఐలో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(BSBD) అకౌంట్: ముఖ్యాంశాలు ఇవే...
సాధారణ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు ఉన్న నిబంధనలే BSBD అకౌంట్‌కు వర్తిస్తాయి. BSBD అకౌంట్‌కు కేవైసీ తప్పనిసరి.
వ్యక్తిగతంగా, జాయింట్‌గా అకౌంట్ ఆపరేట్ చేయొచ్చు.
దేశంలోని అన్ని ఎస్బీఐ బ్రాంచ్‌లల్లో BSBD అకౌంట్ తీసుకోవచ్చు.
BSBD అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు.
ఈ అకౌంట్లో గరిష్టంగా ఎంతైనా దాచుకోవచ్చు.
సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు ఉన్న వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
రూ.1 కోటి వరకు 3.5 శాతం, రూ. 1 కోటి పైన 4 శాతం వడ్డీ లభిస్తుంది.
దేశంలోని అన్ని బ్రాంచులు, ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
అకౌంట్ తీసుకున్నవారికి బేసిక్ రూపే ఏటీఎం/డెబిట్ కార్డ్ లభిస్తుంది.
ఏటీఎం/డెబిట్ కార్డుపై ఎలాంటి ఛార్జీలు ఉండవు.
నెలకు 4 సార్లు ఏటీఎం నుంచి ఉచితంగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
NEFT/RTGS సేవలు కూడా ఉచితం.
అకౌంట్ వాడకపోయినా ఎలాంటి ఛార్జీలు ఉండవు.
అకౌంట్ క్లోజ్ చేయడానికి కూడా ఛార్జీలు ఉండవు.
BSBD అకౌంట్ కావాలంటే ఇప్పటికే ఎస్బీఐలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండకూడదు.
ఒకవేళ మీకు ఇప్పటికే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే BSBD అకౌంట్ ఓపెన్ చేసిన 30 రోజుల్లో పాత అకౌంట్‌ను క్లోజ్ చేయాలి. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. Photos: రూ.83,000 కోట్ల ఎయిర్పోర్ట్... ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.