SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఆగస్ట్ 1 నుంచి ఈ ఛార్జీలు ఉండవు

SBI IMPS Charges | ఎస్‌బీఐ బ్రాంచ్‌లల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే మాత్రం నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ ఛార్జీలు చెల్లించాల్సిందే. ఎస్‌బీఐ కస్టమర్లకు మాత్రం బ్రాంచ్‌లల్లో నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ ఛార్జీల్లో 20% తక్కువ ఉంటాయి.

news18-telugu
Updated: July 29, 2019, 1:06 PM IST
SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఆగస్ట్ 1 నుంచి ఈ ఛార్జీలు ఉండవు
SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఆగస్ట్ 1 నుంచి ఈ ఛార్జీలు ఉండవు
news18-telugu
Updated: July 29, 2019, 1:06 PM IST
ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఖాతాదారులు ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే ఆగస్ట్ 1 నుంచి ఐఎంపీఎస్ ఛార్జీలు ఉండవు. ప్రస్తుతం ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్‌కు ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్-IMPS ఛార్జీలను వసూలు చేస్తోంది ఎస్‌బీఐ. జూలై 1న నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ ఛార్జీలను తొలగించిన ఎస్‌బీఐ... ఆ తర్వాత ఐఎంపీఎస్ ఛార్జీలను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎస్‌బీఐ బ్రాంచ్‌లల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే మాత్రం నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ ఛార్జీలు చెల్లించాల్సిందే. ఎస్‌బీఐ కస్టమర్లకు మాత్రం బ్రాంచ్‌లల్లో నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ ఛార్జీల్లో 20% తక్కువ ఉంటాయి. బ్రాంచ్‌లల్లో రూ.1,000 వరకు ఐఎంపీఎస్ ఛార్జీలు ఉండవు. అంతకన్నా ఎక్కువ ట్రాన్స్‌ఫర్ చేస్తే మాత్రం ఛార్జీలు చెల్లించాలి. ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ ఛార్జీల్లో ఎస్‌బీఐ కస్టమర్ల కోసం చేసిన మార్పుల్ని ఈ చార్ట్‌లో చూడండి.








Loading...



























పేమెంట్ మోడ్ సర్వీస్ ఛార్జీలుతేదీ
ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఛార్జీలు లేవు 2019 జూలై 1 నుంచి
ఐఎంపీఎస్ యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఛార్జీలు లేవు 2019 ఆగస్ట్ 1 నుంచి
ఐఎంపీఎస్ బ్యాంకు బ్రాంచ్‌ రూ.1,000 వరకు ఛార్జీలు లేవు 2019 ఆగస్ట్ 1 నుంచి
ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ బ్యాంకు బ్రాంచ్‌ ఛార్జీల్లో 20 శాతం తగ్గింపు 2019 జూలై 1 నుంచి

BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ... కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

SBI: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్... రిజిస్టర్ చేసుకోవడానికి స్టెప్స్ ఇవే...

Govinda App: ఈ యాప్ ఉంటే తిరుమలలో దర్శనం, రూమ్ బుక్ చేయడం ఈజీ...
First published: July 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...