బంగారం కొంటున్నారా... కొత్త రూల్స్ తెలుసుకోండి మరి...

Gold Hallmark : మనం కొనే బంగారం స్వచ్ఛమైనదా, కాదా అన్నది కచ్చితంగా తేలాలంటున్న కేంద్ర ప్రభుత్వం... 2021 జనవరి 15 నుంచీ అన్ని బంగారు నగలపై హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరి చేసింది. దీని వల్ల ఏం జరుగుతుంది?

news18-telugu
Updated: November 30, 2019, 5:54 AM IST
బంగారం కొంటున్నారా... కొత్త రూల్స్ తెలుసుకోండి మరి...
బంగారం కొంటున్నారా... కొత్త రూల్స్ తెలుసుకోండి మరి...
  • Share this:
Gold Hallmark : మన దేశంలో బంగారం ప్రతీ ఇంట్లో ఉంటుంది. ఇదో సెంటిమెంట్. ఆపద సమయంలో వెంటనే ఆదుకునే అవసరంగా కూడా బంగారాన్ని కొనుక్కుంటారు చాలా మంది. ఐతే... బంగారం పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. స్వచ్ఛమైన బంగారం అని చెబుతూ... మోసాలు చేస్తున్నా్రు చాలా మంది నగల వ్యాపారులు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు, స్వచ్ఛమైన బంగారాన్ని మాత్రమే అమ్మించేలా చేసేందుకు... 2021 జనవరి 15 నుంచీ బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేసింది కేంద్రం. ఇక అప్పటి నుంచీ దేశంలో బంగారంతో ఏ నగలు చేసినా, అమ్మినా హాల్ మార్కింగ్ కచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఉన్న నగలన్నింటినీ (హాల్ మార్క్ లేనివి) 2021 జనవరి 15 లోపు వ్యాపారులు అమ్మేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత హాల్ మార్క్ లేకుండా అమ్మితే కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. అంతే కాదు... బంగారం అమ్మే వ్యాపారులంతా భారతీయ ప్రమాణాల మండలి (BIS) దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి కూడా. ఇలా చెయ్యకపోతే, రూ.లక్ష నుంచి బంగారం విలువపై 5 రెట్ల మొత్తం దాకా ఫైన్, సంవత్సరం పాటు జైలు శిక్ష తప్పదు. ఒక ఆభరణానికి హాల్‌మార్క్‌ వేసేందుకు రూ.50 ఛార్జి అవుతుంది. 2000 ఏప్రిల్‌ నుంచి వ్యాపారులే స్వయంగా నగలకు హాల్ మార్కింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ఇప్పటికీ హాల్ మార్కింగ్ లేని నగలు అమ్ముతుండటం వల్లే కేంద్రం ఈ కొత్త రూల్ తెచ్చింది.

ప్రస్తుతం BIS దగ్గర 26,019 నగల వ్యాపారులు రిజిస్టర్ చేయించుకున్నారు. 2021 జనవరి 15 తర్వాత పాత నగలు (హాల్ మార్క్ లేనివి) మిగిలితే వాటిని కరిగించేయాల్సి ఉంటుంది. తిరిగి కొత్త రూల్స్ ప్రకారం నగలు తయారుచేయాల్సి ఉంటుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే నగలకూ హాల్‌మార్క్‌ తప్పనిసరి. అంతేకాదు ఇకపై 14, 18, 22 క్యారెట్ల బంగారు నగలు మాత్రమే అమ్ముతారు. ఇష్టమొచ్చినట్లు క్యారెట్లు నిర్ణయించడం కూడా నేరమే. ప్రతి జువెలరీ షాపులో... పై మూడు రకాల క్యారెట్ల నగల రేట్లను బోర్డులో చూపించాల్సి ఉంటుంది. ఒక్కో కస్టమర్‌కి ఒక్కో రేట్ చెబితే కుదరదు.

ప్రజల దగ్గర కూడా పాత బంగారం ఉంటుంది. దానికి హాల్ మార్క్ లేకపోయినా... వారు ఎప్పుడైనా సరే... దాన్ని అమ్ముకోవచ్చని కేంద్రం తెలిపింది. పాత బంగారాన్ని కొన్న వ్యాపారులు తిరిగి అమ్మేటప్పుడు దాన్ని కరిగించి... హాల్ మార్క్‌తో నగలు తయారుచేసి అమ్మాల్సి ఉంటుంది. నగలు అమ్మేటప్పుడు ఏ క్యారెట్‌ ప్రకారం అమ్మారో చెబుతూ, ఎంత డబ్బు తీసుకున్నారో ఆ వివరాలతో సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

 

Pics : బాలీవుడ్‌ను కట్టిపడేస్తున్న తన్యా గవ్రీ ఫ్యాషన్ డిజైన్స్
ఇవి కూడా చదవండి :Health Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.

Health Tips : వైట్ టీ తాగుతున్నారా... ఆరోగ్యానికి మేలు

Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు


Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి

Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు

First published: November 30, 2019, 5:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading