2019 ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది?

రూపాయి పతనం ఆగదు. 2019 ఆర్థిక సంవత్సరానికి రూపాయి మారకం విలువ రూ.75 వరకు పడిపోతుంది. సెన్సెక్స్ 40,000 దాటుతుంది. పలువురు నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి.

news18-telugu
Updated: September 12, 2018, 1:34 PM IST
2019 ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది?
రూపాయి పతనం ఆగదు. 2019 ఆర్థిక సంవత్సరానికి రూపాయి మారకం విలువ రూ.75 వరకు పడిపోతుంది. సెన్సెక్స్ 40,000 దాటుతుంది. పలువురు నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి.
  • Share this:
రూపాయి రోజురోజుకీ చరిత్రను తిరగరాస్తోంది. బుధవారం ఉదయం రూ.72.80తో మొదలైంది. సెన్సెక్స్ రెండు రోజుల్లో 1000 పాయింట్లు పతనమైంది. ఈ పరిణామాలపై నిపుణుల అభిప్రాయాలేంటో తెలుసా? 2019 ఆర్థిక సంవత్సరానికి రూపాయి మారకం విలువ రూ.75 వరకు పడిపోతుంది. సెన్సెక్స్ 40,000 దాటుతుంది. మనీకంట్రోల్ వెబ్‌సైట్ 10 మంది నిపుణుల్ని ప్రశ్నిస్తే సగం మంది ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 30 శాతం మంది రూపాయి మారకం విలువ రూ.72 కన్నా తక్కువ ఉంటుందని చెప్తే... 20 శాతం మంది ఏకంగా రూపాయి విలువ రూ.75-80 డాలర్లకు చేరుతుందన్నారు.

rupee value, dollar rate, sensex, nifty, petrol price, diesel price, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, రూపాయి విలువ, డాలర్ రేట్, సెన్సెక్స్, నిఫ్టీ

ప్రస్తుతం ఇండియా జీడీపీ రేటు జూన్ త్రైమాసికానికి 8.2 శాతం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 7.6-7.7% ఉంటుందని అంచనా. అలా ఉన్నా బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నట్టేనని నిపుణుల వాదన. గత రెండు పర్యాయాల్లో ఆందోళన వ్యక్తమైనా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, బాండ్ ఈల్డ్స్ కారణంగా జీడీపీ 8.18కు చేరుకుంది. కరెంట్ అకౌంట్ లోటును పెంచింది. కరెంట్ అకౌంట్ లోటు పెరగడం అంటే... దేశం ఎగుమతి చేస్తున్నదానికన్నా ఎక్కువగా దిగుమతి చేసుకుంటుండటం వల్ల కరెన్సీపై ఒత్తిడి పెరుగుతోంది. కరెంట్ అకౌంట్ లోటు పెరిగితే రూపాయి మరింత బలహీనపడుతుందంటున్నారు నిపుణులు.

మార్కెట్లు ఎలా ఉంటాయి?


రూపాయి విలువ పతనమవడం మార్కెట్‌ను కుప్పకూలుస్తోంది. అయితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో కరెక్షన్ కొద్ది కాలమే ఉంటుందని, త్వరలో మరిన్ని రికార్డులు చూడొచ్చని అభిప్రాయ పడుతున్నారు నిపుణులు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సెన్సెక్స్ 38,000 దగ్గర ఆగుతుందని 11% మంది, 38,000-40,000 చేరుకుంటుందని 45 % మంది, 40,000-42,000 చేరుకుంటుందని 33% మంది, 42,000 దాటుతుందని 11% మంది అభిప్రాయపడ్డారు. అంతే తప్ప మార్కెట్ పడిపోయే ప్రసక్తి లేదన్నది వారి వాదన.

rupee value, dollar rate, sensex, nifty, petrol price, diesel price, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, రూపాయి విలువ, డాలర్ రేట్, సెన్సెక్స్, నిఫ్టీ

ఇక నిఫ్టీ50 ఇండెక్స్ 10,000 లోపు ఉంటుందని 10% మంది, 10,000-12,000 మధ్య ఉంటుందని 60% మంది, 12,000-14,000 మధ్య ఉంటుందని 30% మంది చెప్పారు.rupee value, dollar rate, sensex, nifty, petrol price, diesel price, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, రూపాయి విలువ, డాలర్ రేట్, సెన్సెక్స్, నిఫ్టీ

ఇవి కూడా చదవండి:

Video: పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

పర్సనల్ లోన్: ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!

రూపాయి పతనంతో మీ జేబుకు చిల్లేనా?

Video: పర్సనల్ లోన్... ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!

 
First published: September 12, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>