IRCTC: రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్... ప్రైవేట్ రైళ్లల్లో కన్సెషన్, కోటా ఉండవు

IRCTC | పలు వర్గాలకు ఇస్తున్న కన్సెషన్ మాత్రం తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వర్తించదు. ఐదేళ్ల వయస్సు దాటిన పిల్లలు కూడా ఫుల్ టికెట్ తీసుకోవాలి.

news18-telugu
Updated: August 27, 2019, 6:07 PM IST
IRCTC: రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్... ప్రైవేట్ రైళ్లల్లో కన్సెషన్, కోటా ఉండవు
IRCTC: రైలు (image: PTI)
  • Share this:
భారతీయ రైల్వే ప్రైవేట్ రైళ్లను పట్టాలెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ రైళ్లల్లో ప్రయాణికులకు ఎలాంటి కన్సెషన్, కోటా ఉండవని వార్తలొస్తున్నాయి. భారతీయ రైల్వేకు చెందిన తొలి ప్రైవేట్ రైలును నడిపే బాధ్యతను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC తీసుకుంది. మొదటి ప్రైవేట్ రైలు 'తేజస్ ఎక్స్‌ప్రెస్'ను ఢిల్లీ-లక్నో మధ్య నడపనుంది. ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ తీసుకొని రెండో ప్రైవేట్ రైలు 'తేజస్ ఎక్స్‌ప్రెస్'ను ముంబై-అహ్మదాబాద్ మధ్య నడపనుంది ఐఆర్‌సీటీసీ. ఒకవేళ ఈ రైలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించనున్నట్టు వార్తలొచ్చాయి. రైలు గంట కన్నా ఎక్కువ ఆలస్యంగా గమ్యస్థానానికి చేరితే కొంత డబ్బును ప్రయాణికుల ఇ-వ్యాలెట్‌లో జమ చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఇప్పుడు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ప్రయాణికులకు టికెట్‌పై ఎలాంటి తగ్గింపు ఇవ్వొద్దని, కోటా నిబంధనలు కూడా వర్తించవని తెలుస్తోంది.

తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఛార్జీలు ఎంత ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను ఐఆర్‌సీటీసీకి ఇచ్చింది భారతీయ రైల్వే. రెండు గమ్యస్థానాల మధ్య ఫ్లైట్ ఛార్జీలతో పోలిస్తే తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో 50 శాతం కన్నా తక్కువగా ఛార్జీలు ఉంటాయని సమాచారం. డైనమిక్ ప్రైజింగ్ ఉన్నా... టికెట్ ధర చివరకు ఫ్లైట్ ఛార్జీల కన్నా తక్కువగానే ఉంటాయి. అయితే రైల్వే వృద్ధులు, వికలాంగులు, రోగులతో పాటు పలు వర్గాలకు ఇస్తున్న కన్సెషన్ మాత్రం తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వర్తించదు. ఐదేళ్ల వయస్సు దాటిన పిల్లలు కూడా ఫుల్ టికెట్ తీసుకోవాలి. ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రయాణికులకు రూ.50 లక్షల వరకు ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఆఫర్ చేసే అవకాశముంది.

భారతీయ రైల్వే సుమారు 53 కేటగిరీలకు కన్సెషన్ ఇస్తోంది. వీరిలో వృద్ధులు, వికలాంగులు, పేషెంట్లు, విద్యార్థులు, అవార్డ్ విన్నర్లు ఉంటాయి. వేర్వేరు కేటగిరీలకు 100% వరకు తగ్గింపు వర్తిస్తుంది. ఇవేవీ ప్రైవేట్ రైళ్లల్లో ఉండవు. అంటే తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలంటే ఎలాంటి కన్సెషన్ లేకుండానే టికెట్ తీసుకోవాలి. అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. వీటిపై ఇండియన్ రైల్వేస్, ఐఆర్‌సీటీసీ ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. అక్టోబర్‌లో ఢిల్లీ-లక్నో మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ నడిచే అవకాశముంది. నవంబర్‌లో ముంబై-అహ్మదాబాద్ మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ చక్కర్లు కొడుతుంది.

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railways: ట్రైన్ టికెట్‌పై 100% వరకు కన్సెషన్... ఎవరెవరికో తెలుసా?IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? సెప్టెంబర్ 1 నుంచి సర్వీస్ ఛార్జీ

IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Published by: Santhosh Kumar S
First published: August 27, 2019, 6:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading