యూపీఐ లావాదేవీలు జరిపేవారిసి శుభవార్త. యూపీఐ ట్రాన్సాక్షన్స్‌పై ఎలాంటి ఛార్జీలు లేవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI క్లారిటీ ఇచ్చింది. 2021 జనవరి 1 నుంచి థర్డ్ పార్టీ యాప్స్ అయిన గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యాప్స్ ఛార్జీలు వసూలు చేస్తాయన్న వార్తలు కొంతకాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు ఆర్థిక లావాదేవీలు జరిపే వారిలో ఆందోళనకు కారణమయ్యాయి. దీంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI క్లారిటీ ఇచ్చింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు ఉంటాయని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఎన్‌పీసీఐ కోరింది. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా జరిపే యూపీఐ ట్రాన్సాక్షన్‌కు అదనంగా ఛార్జీలు ఏమీ ఉండవని స్పష్టం చేసింది.
ఇక ఇప్పటికే యూపీఐ లావాదేవీల విషయంలో థర్డ్ పార్టీ యాప్స్‌కు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI క్యాప్ విధించిన సంగతి తెలిసిందే. మొత్తం యూపీఐ లావాదేవీల్లో ఒక యాప్ గరిష్టంగా 30 శాతం వాటా మాత్రమే పొందే ఛాన్స్ ఉంది. 2021 జనవరి నుంచే ఈ రూల్ వర్తిస్తుంది.
— India Be Safe. India Pay Digital. (@NPCI_NPCI) January 1, 2021
నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇక కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగాయి. యూపీఐ పేమెంట్స్ లెక్కలు చూస్తే 2020 అక్టోబర్‌లో రూ.3,86,106 కోట్ల విలువైన 207 కోట్ల లావాదేవీలు జరగగా, 2020 నవంబర్‌లో రూ.3,90,999 కోట్ల విలువైన 221 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇక 2020 డిసెంబర్‌లో రూ.4,16,176 కోట్ల విలువైన 223 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ లెక్కలు చూస్తుంటే ప్రతీ నెల యూపీఐ పేమెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.