ITR : ఐటీ ఫారమ్స్‌లో మార్పులు లేవు... స్పష్టంచేసిన ఆదాయ పన్ను శాఖ

IT Forms : ఇప్పటివరకూ కోటి 38 లక్షల ఐటీ ఫారమ్స్ ఫైల్ అయ్యాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ లేనట్లే.

Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 8:28 AM IST
ITR : ఐటీ ఫారమ్స్‌లో మార్పులు లేవు... స్పష్టంచేసిన ఆదాయ పన్ను శాఖ
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 8:28 AM IST
Income Tax Return : పన్ను చెల్లించేందుకు ఉపయోగించే ఐటీ ఫారమ్‌లలో మార్పులు చేస్తున్నారనీ, అందువల్ల పాత ఫారంలలో పన్ను చెల్లిస్తే... వెనక్కి పంపిస్తారనీ ఊహాగానాలు వెలువడుతున్న వేళ... కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. ఐటీ ఫారం(ఇన్‌కం టాక్స్ రిటర్న్ - ITR)లలో ఎలాంటి మార్పులూ రాలేదనీ... ఇప్పుడున్న ఫార్మాట్‌లోనే టాక్స్ చెల్లించవచ్చని తెలిపింది. ఫారంలో మార్పులు చేసినా... ప్రస్తుతానికి పాత ఫార్మాట్‌లో చెల్లించవచ్చని వివరించింది. ఇప్పటికే 85 లక్షల మంది పాత ఫారంలతోనే పన్ను చెల్లించారు. ఆన్‌లైన్‌తో కలిపి మొత్తం 1.38 కోట్ల మంది టాక్స్ పే చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి... ఏప్రిల్ 1 నుంచీ అమల్లో ఉన్న ITR ఫారంలోనే పన్ను చెల్లించవచ్చు. జులై 11 నుంచీ ITR ఫారంలలో మార్పులు రాబోతున్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లను నమ్మొద్దని ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది.

ఆన్‌లైన్ ఐటీ ఫారంలలో సాఫ్ట్‌వేర్ మార్పులు రెగ్యులర్‌గా జరుగుతాయనీ, ప్రజలు చెప్పే సమస్యల్ని (ఫీడ్ బ్యాక్) లెక్క లోకి తీసుకొని... ఎప్పటికప్పుడు మార్పులు చేస్తామని ఐటీ అధికారులు తెలిపారు. ఐటీఆర్-2, ఐటీఆర్-3కి సంబంధించిన ఈ-ఫైలింగ్ సాఫ్ట్‌వేర్ యుటిలిటీని మే 2, మే 10న విడుదల చేశారు.

ఈ-ఫైలింగ్ ద్వారా... వీలైనంత తక్కువగా ఫారం ఫిలప్ చేసేందుకు వీలవుతుందనీ, అలాగే డిజిటల్ రూపంలో సేవ్ చేసుకోవడానికి వీలవుతుందని కేంద్రం చెబుతోంది. కాగితం వాడకం తగ్గించేందుకు కూడా ఇది చక్కటి అవకాశంగా కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ఈ-ఫైలింగ్‌పై టాక్స్ చెల్లింపుదారుల నుంచీ పూర్తి మద్దతు లభిస్తోంది.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...