ముంబై (Mumbai)లో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముకేశ్ అంబానీ, నీతా అంబానీ కుటుంబ సభ్యులు ఇప్పటికే చేరుకున్నారు. కాసేపటి క్రితం కూతురు ఈషా, ఆమె మామ అజయ్ పిరమల్ కూడా విచ్చేశారు. వారికి ముకేశ్ అంబానీ స్వాగతం పలికారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్పైడర్ మ్యాన్ సినిమాలో నటించిన టామ్ హాలండ్, నటి జెండయా, అనుష్క దండేకర్ సైతం ఈ ఈవెంట్‌లో సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథుల జాబితా చాలా పెద్దదిగా ఉంది. ఎంతో మంది ప్రముఖులు ఎన్ఎంఏసీసీ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని వీడియోలను పంచుకున్నారు. వాటిని ఇక్కడ చూద్దాం.
ఈషా అంబానీ, అజయ్ పిరమల్‌కి స్వాగతం పలికిన ముకేశ్ అంబానీ.
View this post on Instagram
ఆకాష్ అంబానీ తన సతీమణి శ్లోకా అంబానీతో కలిసి వేదిక వద్దకు చేరుకున్నారు.
View this post on Instagram
అనంత్ అంబానీ.. తన కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చారు.
View this post on Instagram
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుటుంబ సభ్యులు కూడా వేదిక వద్దకు చేరుకున్నారు.
View this post on Instagram
అంతకుముందు నీతా అంబానీ ఈ సాంస్కృతిక కేంద్రం వద్ద సంప్రదాయ పద్దతిలో రామనవమి పూజను నిర్వహించారు. భారతీయ కళలను ప్రోత్సహించడంతో పాటు సంరక్షించడడమే దీని ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mukesh Ambani, Mumbai, Nita Ambani, Reliance