హోమ్ /వార్తలు /బిజినెస్ /

Health Insurance: క్లెయిమ్ చేసే వరకు ప్రీమియం లాక్ చేసే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ లాంచ్.. ప్రయోజనాలు ఇవే..

Health Insurance: క్లెయిమ్ చేసే వరకు ప్రీమియం లాక్ చేసే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ లాంచ్.. ప్రయోజనాలు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Health Insurance: ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నివా బుపా (Niva Bupa) తాజాగా ఒక కొత్త ఆరోగ్య బీమా ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. రీఅష్యూర్‌ 2.0 (ReAssure 2.0) అని పిలిచే ఈ ప్రొడక్ట్ అన్‌-యూస్డ్ ఇన్సూరెన్స్‌ క్యారీ ఫార్వర్డ్, ఎంట్రీ-ఏజ్‌తో లింకైన రెన్యువల్ ప్రీమియంలు, క్లెయిమ్-ఫ్రీ వంటి ఫీచర్లను అందిస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కరోనా తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. దాంతో చాలా కంపెనీలు కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నివా బుపా (Niva Bupa) తాజాగా ఒక కొత్త ఆరోగ్య బీమా ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. రీఅష్యూర్‌ 2.0 (ReAssure 2.0) అని పిలిచే ఈ ప్రొడక్ట్ అన్‌-యూస్డ్ ఇన్సూరెన్స్‌ క్యారీ ఫార్వర్డ్, ఎంట్రీ-ఏజ్‌తో లింకైన రెన్యువల్ ప్రీమియంలు, క్లెయిమ్-ఫ్రీ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఈ ReAssure 2.0లో ప్లాటినం+, టైటానియం+ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ReAssure 2.0 అనేది అసలైన ReAssure ప్రొడక్ట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ReAssure, Booster, Safeguard ఫీచర్లకు మెరుగైన వెర్షన్లను అందిస్తుంది.

* క్లెయిమ్ చేసే వరకు ప్రీమియం లాక్

సాధారణంగా, రెన్యువల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు బీమా కంపెనీల క్లెయిమ్ ఎక్స్‌పీరియన్స్, హెల్త్‌కేర్ ఇన్ఫ్లేషన్, వయసు పరిధిని బట్టి పెరుగుతాయి. అయితే ReAssure 2.0లోని "లాక్ ది క్లాక్ (Lock the Clock)" ఫీచర్ పాలసీదారుడు తన మొదటి క్లెయిమ్ చేసే వరకు పాలసీ తీసుకున్నప్పుడు ఉన్న వయసునే లాక్ చేస్తుంది. అంటే ఒకవేళ మీరు 40 ఏళ్ల వయస్సులో పాలసీని కొనుగోలు చేస్తే, మీరు మీ మొదటి క్లెయిమ్ చేసే వరకు ఈ ఏజ్-బ్యాండ్‌కు వర్తించే యాన్యువల్ ప్రీమియం కొనసాగుతుంది. ఇలా ఎంట్రీ-ఏజ్‌తో లింకైన రెన్యువల్ ప్రీమియంల వల్ల పాలసీదారులకు చాలా ప్రయోజనం కలుగుతుంది.

* అన్‌-యూస్డ్ ఇన్సూరెన్స్‌ క్యారీ ఫార్వర్డ్

ఇక Booster+ బెనిఫిట్ పాలసీదారులకు నెక్స్ట్ పాలసీ ఇయర్‌కి ఏదైనా ఉపయోగించని బేస్ మొత్తాన్ని ఫార్వర్డ్ చేయడానికి సహాయపడుతుంది. అలా గరిష్టంగా సేకరించిన బీమా మొత్తం, బీమా చేసిన బేస్ మొత్తానికి ఐదు లేదా పది రెట్లు పెరుగుతుంది. అలానే ReAssure Forever ఫీచర్ పాలసీదారు తన మొదటి క్లెయిమ్ చేసిన తర్వాత, తన బేస్ మొత్తానికి సమానమైన ఇన్సూర్డ్‌ అమౌంట్‌ను ఎల్లప్పుడూ కలిగి ఉంటారని హామీ ఇస్తుంది. సేఫ్‌గార్డ్+ అనే ఫీచర్ ఆప్షనల్‌గా లభిస్తోంది. ఇది సాధారణ పాలసీల కింద చెల్లించలేని అన్ని ఖర్చులను క్లెయిమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది రూ.1 లక్ష వరకు తక్కువ క్లెయిమ్ మొత్తానికి బూస్టర్+ ప్రయోజనాన్ని రక్షిస్తుంది.

కొత్త హెల్త్ ప్రొడక్ట్ రివార్డ్ ప్రోగ్రామ్‌లను కూడా ఆఫర్ చేయడం విశేషం. ఇక్కడ పాలసీదారులు వారి హెల్త్ స్కోర్‌పై ఆధారపడి రెన్యువల్ ప్రీమియంలపై 30 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ప్లాన్‌లో రూమ్ రెంట్ సబ్-లిమిట్స్, టెలి-కన్సల్టింగ్ ఆఫర్ వంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఇది మొదటి పాలసీ రోజు నుంచి మధుమేహం, హైపర్‌టెన్షన్‌ను కవర్ చేస్తుంది.

ఇది కూడా చదవండి : ఈ స్కీమ్ లో రూ.8,416‌ ఇన్వెస్ట్ చేయండి.. నెలకు దాదాపు రూ.5.6 లక్షలు పెన్షన్ పొందండి!

ఏ ఆసుపత్రిలో చేరినా రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఉండేందుకు అనుమతిస్తుంది. కొత్త హెల్త్ ప్రొడక్ట్‌లో 18-65 ఏజ్ బ్రాకెట్ కోసం సమ్ ఇన్సూడ్‌ ఆప్షన్స్‌ రూ. 5 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఉంటాయి. ఈ ప్రొడక్ట్ చెల్లించిన ప్రతి ప్రీమియంపై బీమా మొత్తంగా గ్యారంటీడ్ రిటర్న్ అందిస్తుంది. దీనివల్ల పాలసీదారులు ఉపయోగించలేని వాటిని అసలు కోల్పోరు. క్లెయిమ్ చేసినా, చేయకపోయినా పాలసీదారులు కోల్పోయేదేమీ

First published:

Tags: Business, Health Insurance, Personal Finance

ఉత్తమ కథలు