వచ్చే రెండు, మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. రుణం తిరిగి చెల్లించడంపై ఆర్బిఐ మూడు నెలల తాత్కాలిక నిషేధం ప్రకటించినప్పటికీ, 'పరిస్థితి చాలా ఘోరంగా ఉందనిఆయన సోమవారం తెలిపారు. రహదారి, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖతో ఎంఎస్ఎంఇ ప్రతినిధులు భేటీ అవ్వగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. అయీతే ప్రభుత్వం పరిశ్రమ వెంటన నిలుస్తుందని, అయితే ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరినీ కాపాడటానికి, ప్రభుత్వ స్థాయి నుంచి సాధ్యమయ్యే ప్రతీ ఒక్క పనిని చేస్తున్నామని గడ్కరీ అన్నారు అంతేకాదు జపాన్, అమెరికా ప్రభుత్వాలు చాలా పెద్ద సైజు ప్యాకేజీలను ప్రకటించాయని, అయితే వాటి ఆర్థిక వ్యవస్థలు భారతదేశం కంటే పెద్దవని గడ్కరీ అన్నారు. ఇదిలా ఉంటే మార్చి 27 న రిజర్వ్ బ్యాంక్ ప్రజల కష్టాలను తగ్గించడానికి వరుస చర్యలను ప్రకటించింది. ఇందులో రుణ చెల్లింపుపై మూడు నెలల పొడిగింపును కూడా ఇచ్చింది.
మరో వైపు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తెలంగాణ పారిశ్రామికవేత్తలతో మాట్లాడిన గడ్కరీ, ఆదాయపు పన్ను మరియు జీఎస్టీ రిటర్న్స్ వెంటనే సంబంధిత వ్యక్తి ఖాతాకు బదిలీ చేసే మార్గం చూసేలా ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించనట్లు ఆయన తెలిపారు.
ఉద్దీపన ప్యాకేజీకి సంబంధించి, రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నుండి ఒక ప్యాకేజీని ఆశిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. అయితే లాక్డౌన్ దృష్ట్యా 2020 మార్చి 26 న కేంద్ర ప్రభుత్వం 1.70 లక్షల కోట్ల రూపాయల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. దీని తరువాత, సామాన్య ప్రజలతో పాటు వాణిజ్య వర్గాలు మరొ సహాయ ప్యాకేజీని ఆశిస్తున్నాయి. మరోవైపు కొత్త ఆర్థిక ప్యాకేజీ కోసం నిరంతరం నివేదికలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు సీనియర్ మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు.