మరో 3 ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రానికి నీతీ ఆయోగ్ సిఫార్సు...

Punjab & Sind Bank, UCO Bank, Bank of Maharashtraలను ప్రైవేటీకరించాలని నీతీ ఆయోగ్ శుక్రవారం ప్రభుత్వాన్ని సిఫారసు చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీలకు నీతీ ఆయోగ్ లేఖ రాసింది.

news18-telugu
Updated: July 31, 2020, 10:51 PM IST
మరో 3 ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రానికి నీతీ ఆయోగ్ సిఫార్సు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Punjab & Sind Bank, UCO Bank, Bank of Maharashtraలను ప్రైవేటీకరించాలని నీతీ ఆయోగ్ శుక్రవారం ప్రభుత్వాన్ని సిఫారసు చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీలకు నీతీ ఆయోగ్ సిఫార్సు చేసింది. Punjab & Sind Bank, UCO Bank, Bank of Maharashtra ల ప్రైవేటీకరణకు 1970 నాటి Banking Companies (Acquisition and Transfer) చట్టానికి సవరణ అవసరం. అదేవిధంగా, పోస్టల్ ఆఫీస్ అవుట్లెట్ల విభాగాన్ని వినియోగించుకోవడానికి కూడా నీతీ ఆయోగ్ సలహాలు ఇచ్చింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడంతో పాటు 15 లక్షలకు పైగా పోస్టల్ అవుట్లెట్ల నెట్‌వర్క్‌ను వాటితో అనుసంధానించి వినియోగించుకోవాలని సూచించింది.

ఇక బాండ్ మార్కెట్లలో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సి) పాల్గొనేలా ప్రోత్సహించడంతో పాటు రానున్న 10ఏళ్ల లో ప్రైవేటు రుణాన్ని జిడిపి నిష్పత్తికి ప్రస్తుత 54 శాతం నుంచి 100 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది.

నీతీ ఆయోగ్ ఇచ్చిన ఇతర ఆసక్తికరమైన సూచన ఏమిటంటే, భారతీయ డేటాను విశ్వసనీయంగా మరియు పొందికగా మార్చడం, కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (సిఎజి) సిఫారసు చేసిన డేటా అకౌంటబిలిటీ మరియు పారదర్శకత చట్టాన్ని త్వరగా అమలు చేయాలని, గణాంకాలు మరియు ప్రోగ్రామ్ అమలు మంత్రిత్వ శాఖ, Ministry of Statistics and Programme Implementation (MoSPI) ను పునరుద్ధరించాలని సూచించింది. ఇది కీలకమైన ఆర్థిక డేటాను ఉత్పత్తి చేస్తుంది. కాగా తుది నిర్ణయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకోవాల్సి ఉంది.
Published by: Krishna Adithya
First published: July 31, 2020, 10:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading