హోమ్ /వార్తలు /బిజినెస్ /

Zerodha: ఉద్యోగులకు బంపరాఫర్.. బోనస్‌గా ఒక నెల జీతం, రూ.10 లక్షల బహుమతి!

Zerodha: ఉద్యోగులకు బంపరాఫర్.. బోనస్‌గా ఒక నెల జీతం, రూ.10 లక్షల బహుమతి!

ఉద్యోగులకు బంపరాఫర్.. ఒక నెల బోనస్, రూ.10 లక్షల రివార్డు!

ఉద్యోగులకు బంపరాఫర్.. ఒక నెల బోనస్, రూ.10 లక్షల రివార్డు!

Employees | ఉద్యోగులకు ఒక కంపెనీ అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఆరోగ్యంగా, ఫిట్‌నెస్‌తో ఉన్న ఉద్యోగులకు ఒక నెల బోనస్ జీతం ఇవ్వనుంది. అంతేకాకుండా ఎంప్లాయీస్‌కు రూ.10 లక్షల వరకు రివార్డులు అందించనుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Zerodha Nithin Kamath | ఆన్‌లైన్ బ్రోకింగ్ సంస్థ జెరోదా కోఫౌండర్, సీఈవో నితిన్ కామత్ ఉద్యోగులకు (Employees) బంపరాఫర్ ప్రకటించారు. కొత్త హెల్త్ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఫిట్‌నెస్ ట్రాకర్స్ మీద డైలీ యాక్టివిటీ గోల్స్‌ను సెట్ చేసుకోవాలని, వాటిని సాధించిన వారికి ఒక నెల బోనస్ (Bonus) జీతం అందిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది కాలంలో ఈ లక్ష్యాల నిర్దేశించుకోవాలని, వాటిని సాధించాలని తెలిపారు.

  మనలో చాలామంది ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నాం. కూర్చోవడం అనేది ఇప్పుడు కొత్త ధూమపానంగా మారుతోంది. ఇది ఒక అంటువ్యాధిగా తయారైంది. అందుకనే ఉద్యోగులు అందరికీ హెల్త్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ అందుబాటులోకి తెచ్చామని కామత్ తెలిపారు. ఈ విషయాన్ని లింక్డ్ ద్వారా వెల్లడించారు. ఉద్యోగులు డైలీ హెల్త్ గోల్స్‌ను 90 శాతం చేరువాల్సి ఉంటుందని, వచ్చే ఏడాది కాలానికి వీటిని నిర్దేశించుకోవాలని, ఎవరైతే లక్ష్యాలను చేరుకుంటారో వారికి రివార్డులు లభిస్తాయని వివరించారు.

  బంగారం, వెండి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా పడిపోయిన ధరలు!

  నెలవారీ జీతాన్ని బోనస్‌గా అందిస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఒక్క లక్కీ డ్రా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో విజేతగా నిలిచిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఉంటుందని వివరించారు. దీని వల్ల సిబ్బందలో మోటివేషన్ వస్తుందన్నారు. అందుకే ఎంప్లాయీస్ అందరూ ఫిట్‌నెస్ గోల్స్‌ను నిర్దేశించుకోవాలని సూచించారు.

  ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్.. ఇలా చేస్తే రూ.549కే స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు!

  అయితే ఇది ఆప్షనల్ ప్రోగ్రామ్. అంటే ఉద్యోగులు వారికి ఇష్టమైతేనే చేరొచ్చు. లేదంటే లేదు. అయితే ఇందులో చేరిన వారు కచ్చితంగా ప్రతి రోజూ కనీసం 350 కిలోక్యాలరీలను కరిగించాల్సి ఉంటుంది. అందువల్ల ఉద్యోగులు ఆసక్తి ఉంటే ఈ హెల్త్ ట్రాకర్ ఫిట్‌నెస్ గోల్స్‌ను స్వీకరించొచ్చు. అదిరిపోయే రివార్డులు సొంతం చేసుకోవచ్చు.

  కాగా జెరోదా నితిన్ కామత్ తన హెల్త్ యాప్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. కోవిడ్ తర్వాత బరువు క్రమంగా పెరుగుతూ వచ్చిందన్నారు. ట్రాకింగ్ యాక్టివిటీ ద్వారా దీన్ని అధిగమించానని, ఆహారం గురించి కూడా మరింత అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. నెమ్మదిగా రోజువారీ లక్ష్యాన్ని 1,000 క్యాలరీలకు పెంచాలని సూచించారు. ఇది నా సెప్టెంబరు లుక్ అని పిక్ షేర్ చేశారు. కాగా నితిన్ కామత్ ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకురావడం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. అప్పుడు కూడా ఉద్యోగులకు రివార్డులు ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Employees, Fitness, Health, Money, Zerodha

  ఉత్తమ కథలు