హోమ్ /వార్తలు /బిజినెస్ /

Radhika Merchant's Arangetram: ఘనంగా రాధిక మర్చంట్ అరంగేట్రం.. హాజరైన అన్ని వర్గాల ప్రముఖులు.. వివరాలివే

Radhika Merchant's Arangetram: ఘనంగా రాధిక మర్చంట్ అరంగేట్రం.. హాజరైన అన్ని వర్గాల ప్రముఖులు.. వివరాలివే

కార్యక్రమానికి హాజరైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, సల్మాన్ ఖాన్

కార్యక్రమానికి హాజరైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, సల్మాన్ ఖాన్

Radhika Merchant's Arangetram: భావన థాకూర్ వద్ద భరతనాట్యంలో శిష్యరికం చేసిన రాధిక మర్చంట్ ఈ రోజు స్టేజిపై తన ప్రదర్శన ద్వారా అరంగేట్రం చేసింది. ఈమె ముఖేష్ అంబానీ (Mukesh Ambani), నీతా అంబానీలకు కాబోయే కోడలు. అనంత్ అంబానీకి కాబేయే శ్రీమతి.

ఇంకా చదవండి ...

  సాంస్కృతిక కార్యక్రమలు అత్యధికంగా జరిగే ముంబాయి (Mumbai) మహానగరం కొన్ని రోజులుగా.. అలాంటి కార్యక్రమాలు లేక చిన్నబోయింది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చే. అయితే.. ఈ రోజు ముంబాయి మహానగరంలో జరిగిన భరత నాట్య ప్రదర్శనతో మహా నగరంలో మళ్లీ సంస్కృతిక కార్యక్రమాల సందడి మళ్లీ మొదలైందని చెప్పవచ్చు. భావన థాకూర్ వద్ద భరతనాట్యంలో శిష్యరికం చేసిన రాధిక మర్చంట్ ఈ రోజు స్టేజిపై తన ప్రదర్శన ద్వారా అరంగేట్రం చేసింది. ఈమె ముఖేష్ అంబానీ (Mukesh Ambania), నీతా అంబానీ (Nita Ambani) లకు కాబోయే కోడలు. అనంత్ అంబానీకి కాబేయే శ్రీమతి. ముంబాయిలోని జియో వరల్డ్ సెంటర్ లో సాయంత్రం ఆమె అరంగేట్ర వేడుక వైభవంగా సాగింది. ఆమె మొదటి సోలో పర్ఫార్మెన్స్ ను ఆశీర్వదించి.. ఆమెను మరింతగా ప్రోత్సహించడానికి నగరంలోని ప్రముఖులు కదిలారు. సినీ, రాజకీయ, వ్యాపార, సేవా రంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి కదిలారు.

  వేడుక వద్ద ముఖేష్ అంబానీ, నీతా అంబానీ

  అందరూ సంప్రదాయ దుస్తులను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంబానీ, మర్చంట్స్ కుటుంబ సభ్యులు అతిథులకు ఘన స్వాగతం పలికారు. వేడుకలో కరోనా నిబంధనలు పాటించారు. రాధిక మర్చంట్ గత ఎనిమిదేళ్లుగా భావన థాగూర్ వద్ద భరతనాట్యంలో మెళకువలను నేర్చుకుంది. అయితే.. అంబానీ కుటుంబంలో భరత నాట్యంలో ప్రావీణ్యం పొందిన రెండో వ్యక్తి రాధిక అంబానీ కావడం విశేషం. మొదటి వ్యక్తి మరెవరో కాదు నీతా అంబానీ. ఆమె కూడా భరత నాట్యంలో శిక్షణ పొందారు.

  ఘనంగా రాధిక మర్చంట్ అరంగేట్రం.. హాజరైన ప్రముఖుల ఫొటోలివే..

  రణ్ వీర్ సింగ్

  ఆమె అనేక ప్రదర్శనలు సైతం ఇచ్చారు. రాధిక ప్రదర్శన పుష్పాంజలితో మొదలైంది. వేధిక, దైవం, గురు, సభికులకు నమస్కారం చేసి ఆమె తన ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం గణేశుడికి వందనం చేశారు.

  ఈ రోజే రాధికా మర్చంట్ భరతనాట్య అరంగేట్రం.. హాజరుకానున్న బాలీవుడ్ తారలు, ఇతర ప్రముఖులు.. విశేషాలివే..

  ఆదిత్య థాకరే, తేజా థాకరేతో లక్ష్మీ థాకరే

  తర్వాత ఆమె నవరసాలను తన నృత్య ప్రదర్శనలో పండించి సభికులను ఆకట్టుకున్నారు. ప్రదర్శన అనంతరం హాజరైన వారందరూ రాధికను అభినందించారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Mukesh Ambani, Mumbai, Nita Ambani, Salman khan

  ఉత్తమ కథలు