హోమ్ /వార్తలు /బిజినెస్ /

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ

కరోనా కష్టాల్లో యావత్ ప్రపంచం కొట్టుమిట్టాడుతున్న సమయంలో వీరంతా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని టౌన్ అండ్ కంట్రీ మ్యాగజైన్ కొనియాడింది.

రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్ టౌన్ అండ్ కంట్రీ విడుదల చేసిన టాప్ గ్లోబల్ ఫిలాంత్రపిస్ట్స్ 2020 జాబితాలో చోటు దక్కింది. నీతాతో పాటు టిమ్ కుక్, ఆఫ్రా విన్‌ఫ్రే, లారిన్ పావెల్ జాబ్స్, ది లాడర్ ఫ్యామిలీ, మైఖేల్ బ్లూంబర్గ్, లియనార్డో డిపాక్రియో వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. భారత్ నుంచి ఈ జాబితాలో నీతా ఒక్కరికే స్థానం దక్కించుకోవడం విశేషం. కరోనా కష్టాల్లో యావత్ ప్రపంచం కొట్టుమిట్టాడుతున్న సమయంలో వీరంతా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని టౌన్ అండ్ కంట్రీ మ్యాగజైన్ కొనియాడింది. లక్షలాది మంది ఆకలి తీర్చడంతో పాటు ఎంతో మంది ప్రాణాలను కాపాడారని ప్రశంసలు కురిపించింది.

ఏవైనా సంక్షోభం వచ్చినప్పుడు తక్షణం స్పందించేలా రిలయన్స్ ఫౌండేషన్‌ను తీర్చిదిద్దాం. కోవిడ్ సమయంలో మేం చేసిన కార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గౌరవంగా భావిస్తున్నా. టౌన్ అండ్ కంట్రీ మ్యాగజైన్‌ టాప్ ఫిలాంత్రఫిస్ట్ జాబితాలో స్థానం దక్కడం ఆనందంగా ఉంది. ఎప్పుడు అవసరమొచ్చినా మా ప్రభుత్వానికి, మా ప్రజలకు సాయం చేస్తాం.
నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్

భారత్‌లో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నీతా అంబాాని ఎంతో మందికి దాన ధర్మాలు చేశారు. పీఎం కేర్స్‌తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు పెద్ద మొత్తాల్లో విరాళాలు అందజేశారు. దేశంలోని తొలి కోవిడ్ ఆస్పత్రిని ముంబైలో నిర్మించారు. అంతేకాదు ఎంతో మంది పేదల ఆకలితి తీర్చారు. వైద్యులు, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు సరఫరా చేశారు. కాగా, టౌన్ అండ్ కంట్రీ అమెరికాలో లీడింగ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్. 1846 నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా పబ్లిష్ అవుతోంది. సమాజ సేవ, లోకోపకారం చేసే వారిని గుర్తించి ప్రోత్సహిస్తోంది.

నీతా అంబానీ

First published:

Tags: Coronavirus, Nita Ambani, Reliance Foundation

ఉత్తమ కథలు