NITA AMBANI ELECTED TO THE BOARD OF THE METROPOLITAN MUSEUM OF ART THE FIRST INDIAN TRUSTEE IN THE MUSEUMS HISTORY SS
ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ బోర్డులో తొలి ఇండియన్‌గా నీతా అంబానీకి అరుదైన గౌరవం
రిలయెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ బోర్డులో గౌరవ ధర్మకర్తగా చేరిన సందర్భంగా ఆమెతో పాటు మ్యూజియం ఛైర్మన్ డేనియల్ బ్రాడ్స్కీ, ప్రెసిడెంట్ అండ్ సీఈఓ డేనియల్ వీస్, డైరెక్టర్ మ్యాక్స్ హోలీన్.
2017లో వింటర్ పార్టీకి నీతా అంబానీని ఆహ్వానించి అరుదైన గౌరవాన్ని అందించింది ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ మ్యూజియం. ఇప్పుడు బోర్డులోకి తీసుకుంది.
విద్యావేత్త, బిజినెస్ వుమెన్, దాతృత్వ కార్యక్రమాల్లో ముందుండే నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో గౌరవ ధర్మకర్తగా చోటు దక్కింది. మ్యూజియం ఛైర్మన్ డేనియల్ బ్రాడ్స్కీ ఈ విషయాన్ని ప్రకటించారు. నవంబర్ 12న బోర్డ్ మీటింగ్‌లో జరిగిన ఎన్నికలో నీతా అంబానీని ఎన్నుకున్నారు. ఈ గౌరవం దక్కిన మొదటి భారతీయురాలు నీతా అంబానీ కావడం విశేషం. 2017లో వింటర్ పార్టీకి నీతా అంబానీని ఆహ్వానించి అరుదైన గౌరవాన్ని అందించిన ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్... ఇప్పుడు బోర్డులోకి తీసుకోవడం విశేషం.
భారత సంస్కృతీ సంప్రదాయాలు, కళలను ప్రోత్సహించడం, పరిరక్షించడంలో నీతా అంబానీ కృషి, అంకితభావం నిజంగా అసాధారణమైనది. ప్రపంచంలోని ప్రతీ మూలలో కళలపై అధ్యయనం చేసేందుకు మ్యూజియంకు ఉన్న సామర్థ్యంపై ఆమె మద్దతు అపారమైన ప్రభావాన్ని చూపిస్తుంది. బోర్డులోకి నీతా అంబానీని ఆహ్వానించడం ఆనందంగా ఉంది.
— డేనియల్ బ్రాడ్స్కీ, మ్యూజియం ఛైర్మన్
భారతదేశంలో దాతృత్వ సంస్థ అయిన రిలయెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ అయిన నీతా అంబానీ 2016లో నస్రీన్ మొహమదీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిననాటి నుంచి ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌కు సపోర్ట్ ఇస్తున్నారు. అమెరికాలో ఇలాంటి ఎగ్జిబిషన్లు నిర్వహించడం అదే మొదటిసారి. 2017 లో భారతదేశానికి చెందిన కళలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇలాంటి మరిన్ని ఎగ్జిబిషన్లను నిర్వహించింది రిలయెన్స్ ఫౌండేషన్.
కొన్నేళ్లుగా భారతదేశంలోని కళల్ని ప్రదర్శించేందుకు, మెరుగుపర్చేందుకు, విస్తరించేందుకు చేస్తున్న సేవలకు, ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌కు మద్దతుగా నిలిచినందుకు నాకు అందిన బహుమతి ఇది. ప్రపంచ వేదికపై భారతదేశానికి చెందిన కళలు, సంస్కృతులకు ప్రాతినిథ్యం కల్పించేందుకు మేము చేస్తున్న కృషికి గుర్తింపుగా ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ తీసుకున్న నిర్ణయం మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తుంది.
— నీతా అంబానీ, రిలయెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్
ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ బోర్డుకు ఎంపికైన నీతా అంబానీ. 150 ఏళ్ల మ్యూజియం చరిత్రలో తొలి భారతీయురాలిగా అరుదైన గౌరవం నీతా అంబానీ సొంతం.
2017 అక్టోబర్ 11 నుంచి 2018 జనవరి 2 వరకు 'మొడర్నిజం ఆన్ ది గంగాస్: రఘుబీర్ సింగ్ ఫోటోగ్రాఫ్స్' ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు కృషి చేసింది రిలయెన్స్ ఫౌండేషన్. ఆ తర్వాత 2019 జూన్ 4 నుంచి సెప్టెంబర్ 29న వరకు 'ఫినామినల్ నేచర్: మృణాళిని ముఖర్జీ' ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇక 2020 నవంబర్ 10న 'ట్రీ అండ్ సెర్పెంట్: ఎర్లీ బుద్ధిస్ట్ ఆర్ట్ ఇన్ ఇండియా 200 బీసీ-ఏడీ 400' ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్లో నీతా అంబానీ సభ్యురాలు కూడా. భారతదేశానికి చెందిన సాంస్కృతిక దిగ్గజాల గొప్పదనాన్ని ఈ తరానికి తెలిపేందుకు ది ఎలిఫాంటా ఫెస్టివల్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కాన్సర్ట్ లాంటి కార్యక్రమాల నిర్వహణకు రిలయెన్స్ ఫౌండేషన్ స్పాన్సర్‌గా నిలిచింది. భారత కళల విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలిపేందుకు ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో 'గేట్స్ ఆఫ్ ది లార్డ్: ది ట్రెడిషన్ ఆఫ్ క్రిష్ణ పెయింటింగ్స్" లాంటి ఎగ్జిబిషన్లను వరుసగా నిర్వహించింది రిలయెన్స్ ఫౌండేషన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.