Sports Business Summit : అంతర్జాతీయ స్పోర్ట్స్ బిజినెస్ సమిట్‌లో నీతా అంబానీ ప్రసంగం...

నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్

లండన్‌లో జరిగిన స్పోర్ట్ బిజినెస్ సమ్మిట్‌ లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె 'ఇన్ స్పైరింగ్ ఎ బిలియన్ డ్రీం: ది ఇండియా ఆపర్చునిటీ' అంశంపై తన అభిప్రాయాలను తెలియజేశారు.

  • Share this:
    అంతర్జాతీయ క్రీడల వ్యాపారం, అందులో కార్పోరేట్ బాధ్యత అనే అంశంపై లండన్‌లో జరిగిన స్పోర్ట్ బిజినెస్ సమ్మిట్‌ లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె 'ఇన్ స్పైరింగ్ ఎ బిలియన్ డ్రీం: ది ఇండియా ఆపర్చునిటీ' అంశంపై తన అభిప్రాయాలను తెలియజేశారు. తన ప్రసంగంలో భారత దేశం అత్యధిక యువ జనాభా ఉన్న దేశమని, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో భారతీయ యువత పేరొందారని ఆమె తెలిపారు. ప్రపంచంలోనే క్రీడా నిపుణులు, భాగస్వామ్య సంస్థలకు ఆమె అభివాదం తెలుపుతూ ప్రసంగించారు. బుద్ధుడు, మహాత్మాగాంధీ జన్మస్థానమైన భారత్ నుంచి తాను ప్రతినిధిగా వచ్చానని, భారత దేశంలోని నూట ముప్ఫై కోట్ల మంది ప్రతినిధిగా ఈ వేదికపైకి వచ్చినందుకు గర్వపడుతున్నానని ఈ సందర్భంగా నీతా అంబానీ పేర్కొన్నారు. దాదాపు 600 మిలియన్ల మంది జనాభా సగటు వయస్సు 20 సంవత్సరాల లోపు అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత దేశంలోని యువతను అంతా ఒక దగ్గరకు చేరిస్తే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా అవతరిస్తుందని తెలిపారు. భారత్ అన్ని రంగాల్లో రాణిస్తోందని, ప్రత్యేకంగా క్రీడా రంగంలో కూడా చక్కటి పురోగతి సాధిస్తోందని అన్నారు. స్త్రీల స్వశక్తీకరణకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ముఖ్యంగా మహిళల సాధికారతపై తన అభిప్రాయాలు బలంగా ఉన్నాయని, మహిళలను అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు క్రీడలను ఆడటంలో మాత్రమే కాదు, ప్రోత్సహించడంలో సైతం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహిళలు అన్ని అడ్డంకులు దాటుకొని రాణిస్తున్నారని తెలిపారు.

    ఇదిలా ఉంటే 2019 అక్టోబర్ 7 నుంచి ప్రారంభమై 10వ తేదీ ముగియనున్న ఈ సదస్సులో క్రీడల భవిష్యత్తు, ఆవిష్కరణలు, వినియోగదారుల ప్రాధాన్యతలపై ప్రభావం వంటి అంశాలపై చర్చ జరుగుతుంది. ఈ సందస్సులో నీతా అంబానీతో పాటు, ప్రపంచం నలుమూలల నుండి 3 వేల మంది కార్పోరేట్ దిగ్గజాలు పాల్గొననున్నారు.



     

    Published by:Krishna Adithya
    First published: