Nissan Offer | మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. భారీ తగ్గింపు ఆఫర్ (Offer) అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 82 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంది. ఫిబ్రవరి నెలలో మాత్రమే మీరు కార్లపై (Cars) భారీ తగ్గింపు పొందొచ్చు. ఇంతకీ ఈ స్థాయిలో ఏ కార్లపై తగ్గింపు ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న నిస్సాన్ కంపెనీ కార్లపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంచింది. కిక్స్, మ్యాగ్నైట్ వంటి మోడళ్లపై కళ్లుచెదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఈ రెండు ఎస్‌యూవీలపై భలే ఆఫర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఫైనాన్స్ స్కీమ్ కింద తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందొచ్చు. తద్వారా కారు కొనొచ్చు.
పోస్టాఫీస్ సూపర్ హిట్ స్కీమ్.. చేరితే రూ.2 లక్షలు మీవే, ఇలా చేయండి!
మ్యాగ్నైట్ కారు విషయానికి వస్తే.. ఈ కారుపై రూ. 82,100 వరకు తగ్గింపు ఉంది. ప్రిమెయింటెనెన్స్ ప్యాకేజ్ కింద రూ. 12,100 వరకు తగ్గింపు పొందొచ్చు. మూడేళ్లకు ఇది వర్తిస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 20 వేల వరకు వస్తుంది. ఇంకా క్యాష్ డిస్కౌంట్ రూ. 12 వేల వరకు ఉంటుంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 15 వేల వరకు లభిస్తుంది. లాయల్టీ బోనస్ రూ. 10 వేల వరకు వస్తుంది. ఇంకా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే రూ. 2 వేల తగ్గింపు ఉంది. ఇలా మొత్తంగా రూ. 82,100 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.
డబ్బుల వర్షం కురిపించే 5 స్టాక్స్.. కొంటే భారీ లాభాలు!
మీరు ఈ కారు కొనేందుకు 6.99 శాతం వడ్డీ రేటుతో లోన్ పొందొచ్చు. టెన్యూర్ 24 నెలల వరకు పెట్టుకోవచ్చు. ఈ కారు ధర రూ. 6 లక్షల నుంచి రూ. 10.94 లక్షల వరకు ఉంది. ఇక కిక్స్ కారు విషయానికి వస్తే.. ఈ కారుపై రూ. 61 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారుపై ఎక్స్చేంజ్ బోనస్ రూ. 30 వేల వరకు వస్తుంది. క్యాష్ డిస్కౌంట్ రూ. 19 వేల వరకు లభిస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 10 వేల వరకు వస్తుంది. ఇక ఆన్‌లైన్ బుకింగ్ ఆఫర్ రూ. 2 వేలు ఉంది. గరిష్టంగా రూ. 61 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ కారుపై కూడా 6.99 శాతం వడ్డీ లోన్ ఆఫర్ ఉంది. 36 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. కారు కొనే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best cars, Budget cars, Car loans, Cars, Latest offers