హోమ్ /వార్తలు /బిజినెస్ /

Nissan SUVs: స్టైలిష్ లుక్‌తో లగ్జరీ కార్స్... నిస్సాన్ నుంచి మూడు గ్లోబల్ ఎస్‌యూవీలు

Nissan SUVs: స్టైలిష్ లుక్‌తో లగ్జరీ కార్స్... నిస్సాన్ నుంచి మూడు గ్లోబల్ ఎస్‌యూవీలు

Nissan SUVs: స్టైలిష్ లుక్‌తో లగ్జరీ కార్స్... నిస్సాన్ నుంచి మూడు గ్లోబల్ ఎస్‌యూవీలు
(Photo: Manav Sinha/News18.com)

Nissan SUVs: స్టైలిష్ లుక్‌తో లగ్జరీ కార్స్... నిస్సాన్ నుంచి మూడు గ్లోబల్ ఎస్‌యూవీలు (Photo: Manav Sinha/News18.com)

Nissan SUVs | నిస్సాన్ ఇండియా తొలిసారి భారతదేశంలో మూడు గ్లోబల్ ఎస్‌యూవీ కార్లను (SUV Car) ప్రదర్శించింది. ఎక్స్-ట్రైల్‌ (X-Trail), కష్కాయ్ (Qashqai), జూక్(Juke) మోడల్స్‌ని పరిచయం చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ మోటార్ (Nissan Motor) ఇండియాలో ఇప్పటికే మాగ్నైట్, కిక్స్ వంటి ఎంట్రీ లెవల్ కార్లను పరిచయం చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ భారత్‌లో తొలిసారిగా మూడు గ్లోబల్ మోడల్‌ ఎస్‌యూవీలు (Global SUVs) తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఎక్స్-ట్రైల్‌ (X-Trail), కష్కాయ్ (Qashqai), జూక్(Juke)గా పిలిచే ఈ గ్లోబల్ కార్లలో ప్రస్తుతం రెండు ఎస్‌యూవీలు టెస్టింగ్ దశలో ఉన్నాయి. వీటిలో ఎక్స్‌-ట్రైల్ మొదటగా ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అవుతుంది. నిస్సాన్ ఇండియా అక్టోబర్ 18న ప్రదర్శించిన నిస్సాన్ కష్కాయ్, నిస్సాన్ జూక్‌ మైల్డ్ హైబ్రిడ్‌ SUVలుగా అందుబాటులోకి వస్తాయి. అయితే ఇండియన్ మార్కెట్‌లో వీటి రిలీజ్ డేట్‌ను కంపెనీ వెల్లడించలేదు. ఎక్స్-ట్రైల్‌ లాంచ్ అయిన తర్వాత వీటిని పరిచయం చేసే అవకాశం ఉంది.

ఇండియన్ రోడ్లపై టెస్టింగ్‌

ఎక్స్-ట్రైల్‌, కష్కాయ్, జూక్ గ్లోబల్ కార్లు ఇండియన్ రోడ్లపై ఎలా పర్ఫార్మ్ చేస్తాయో తెలుసుకోవడం కోసం నిస్సాన్ ఇండియా టెస్టింగ్ జరుపుతోంది. ప్రస్తుతానికి ఈ కంపెనీ నిస్సాన్ ఎక్స్-ట్రైల్, నిస్సాన్ కష్కాయ్ కార్లను భారతీయ రోడ్లపై తిప్పుతోంది. టెస్టింగ్ ప్రాసెస్‌లో భాగంగా ఇండియాలోని విభిన్న భూభాగాలకు ఈ కార్లు ఎంత అనుకూలంగా ఉంటాయో తెలుసుకుంటోంది. ఇవే పరీక్షలలో కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ప్రతి వాహనం సామర్థ్యాన్ని అంచనా వేస్తోంది. ఈ నెల నుంచి X-Trail, Qashqai రెండింటినీ చెన్నైలోని కంపెనీ తయారీ కర్మాగారం చుట్టూ ఉన్న రోడ్లపై నిస్సాన్ టాప్ ఇంజనీర్లు డ్రైవ్ చేస్తూ పరీక్షిస్తారు.

YouTube: యూట్యూబ్ యూజర్లకు గుడ్ న్యూస్... ఇక అందరికీ ఆ యాక్సెస్

నిస్సాన్ జూక్‌ విషయానికొస్తే దీనికి ఇండియన్ కస్టమర్ల నుంచి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో చూసి ఆపై భారతీయ రోడ్లపై టెస్ట్ చేసి మార్కెట్‌లో పరిచయం చేయవచ్చు. నిస్సాన్ జూక్ 115 bhp, 200 Nm ఓవర్‌బూస్ట్‌తో 1.0-లీటర్ మూడు సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది, 6-స్పీడ్ మాన్యువల్ లేదా పాడిల్ షిఫ్టర్‌లతో ఏడు-స్పీడ్ డ్యూయల్-క్లచ్ DCTని ఇందులో ఆఫర్ చేశారు.

Tax on Diwali Gifts: దీపావళికి బోనస్ వచ్చిందా? గిఫ్ట్ తీసుకున్నారా? ట్యాక్స్ చెల్లించాలి

టెస్టింగ్ దశ పూర్తయిన తర్వాత, ఎక్స్-ట్రైల్‌ను ముందుగా అమ్మకానికి తీసుకొస్తారు, ఆ తర్వాత భారతదేశంలోని ఇతర మోడళ్లను ప్రవేశపెడతారు. ఇండియాలో 5-సీట్లు లేదా 7-సీట్లతో నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఒక ప్రీమియం ఎగ్జిక్యూటివ్ SUVగా లాంచ్ కావచ్చు. ఇది వోక్స్‌వ్యాగన్ టిగువాన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి పోటీ ఇస్తుంది. ఈ వాహనాల పర్ఫామెన్స్ అంచనా వేయడం ద్వారా కంపెనీ ఇండియాలో స్ట్రాంగ్ ఫ్యూచర్ ఏర్పరచుకోవడం సాధ్యమవుతుంది. ఈ గ్లోబల్ కార్ల ఆవిష్కరణ సందర్భంగా నిస్సాన్ ఇండియా ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ మాట్లాడుతూ, నేటి భారతీయుల అవసరాలకు అనుగుణంగా ఇండియన్ మార్కెట్‌లో అత్యుత్తమ వాహనాలను పరిచయం చేయడం ముఖ్యమని చెప్పారు.

First published:

Tags: Auto News, Cars

ఉత్తమ కథలు