Nissan Magnite: మార్కెట్లోకి నిస్సాన్ మాగ్నైట్ కారు...ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..మరీ ఇంత చీపా

జపాన్ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మరో కొత్త కారును లాంచ్ చేసింది. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ Magnite ను నిస్సాన్ భారత మార్కెట్లోకి బుధవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.4.99 లక్షలు.

news18-telugu
Updated: December 2, 2020, 5:08 PM IST
Nissan Magnite: మార్కెట్లోకి నిస్సాన్ మాగ్నైట్ కారు...ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..మరీ ఇంత చీపా
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
జపాన్ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మరో కొత్త కారును లాంచ్ చేసింది. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ Magnite ను నిస్సాన్ భారత మార్కెట్లోకి బుధవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.4.99 లక్షలు. మోడళ్లను బట్టి ధరలు ఉన్నాయి. టాప్ వేరియంట్‌ ధర రూ.9.35 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ ధరలు డిసెంబర్ 31 వరకు చెల్లుతాయని ఆ సంస్థ ప్రకటించింది. వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఎస్‌యూవీ ప్రారంభ ధరను రూ.5.54 లక్షలకు (ఎక్స్‌షోరూమ్) సవరించనున్నారు. ఈ మోడల్ మొత్తం నాలుగు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. Magnite XE, XL, XV, XV ప్రీమియం వేరియంట్లను నిస్సాన్ అభివృద్ధి చేసింది. ఈ ఎస్‌యూవీ మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా కెయువి300 కార్లతో పోటీ పడనుంది.

సరికొత్త ఇంజిన్‌..

మాగ్నైట్ కారు 1.0 లీటర్, 1.0-లీటర్ HRA0 టర్బో ఇంజిన్ వంటి రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. సివిటి ఆటోమేటిక్ లేదా ఫైవ్-స్పీడ్ మాన్యువల్‌ ఆప్షన్‌తో ఈ కారును వినియోగదారులు ఎంచుకోవచ్చు. ఈ ఎస్‌యూవీలో ఉండే థ్రీ సిలిండర్ మోటార్ 5000 ఆర్‌పిఎమ్ వద్ద 98 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 2800-3600 ఆర్‌పిఎమ్ వద్ద 160 ఎన్ఎమ్ టార్కును ఉత్పత్తి చేస్తుంది.

ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి ?
ఈ కారు క్రూజ్ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ డ్రైవ్ అసిస్ట్ డిస్ప్లే, ఎల్‌ఈడీ లైట్ గైడ్‌తో బై-ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి ఫీచర్లతో లభిస్తుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వేకిల్ డైనమిక్ కంట్రోల్ సిస్టమ్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి వైర్‌లెస్ కనెక్టివిటీ ఆప్షన్లు.. లాంటి అదనపు ఫీచర్లతో మ్యాగ్నైట్‌ ఎస్‌యూవీని నిస్సాన్ అభివృద్ధి చేసింది.
Published by: Krishna Adithya
First published: December 2, 2020, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading